స్థానిక సంస్థల్లో ప్రజలు బుద్ధి చెప్పినా టీడీపీ నేతల తీరు మారడం లేదు

మంత్రి అవంతి శ్రీనివాస్‌

చంద్రబాబుకు విదేశీ అంటే ఎంత మోజో అందరికీ తెలుసు 

దేశ ప్రధానికి లేఖలు రాసే ధైర్యం చంద్రబాబుకు ఉందా 

విశాఖ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పినా వారి తీరు మారడం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమిస్తుందన్నారు. టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మంగళవారం విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడారు. విదేశీ  వ్యామోహం అంటే చద్రబాబు అండ్‌ టీమ్‌కు ఎంతో ఇష్టమన్నారు.  ఎవరితోనూ లాలూచీ పడాల్సిన అవసరం మాకు లేదన్నారు. బహీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపింది ఎవరో అందరికీ తెలుసు అన్నారు. దీక్షలు చేస్తున్న ప్రజా సంఘాల నేతలను టీడీపీ నేతలు కనీసం పరామర్శించలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మా ఓర్పు, సహనాన్ని పరీక్షించొద్దని హితవు పలికారు. విధానపరంగా మాట్లాడుకుందామని సూచించారు. అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లి వచ్చినా తీరు మార్చుకోవడం లేదన్నారు. చంద్రబాబులా మా నాయకుడు పూటకో మాట మాట్లాడరని చెప్పారు. ఎన్నికల్లో గెలిచే సత్తా లేక టీడీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 
విశాఖ ఉక్కు ప్రైవేటీకరించొద్దని వైయస్‌ఆర్‌సీపీ పోరాడుతుందన్నారు. ప్రైవేటీకరణపై టీడీపీ నేతలు ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. దేశ ప్రధానికి లేఖలు రాసే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ నిలదీశారు.

 

Back to Top