పంచగ్రామల సమస్యలను పరిష్కరించేందుకు కృషి  

 రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రిడా  శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు
 

విశాఖపట్నం : పంచగ్రామల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నమని  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రిడా  శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ  నరసింహస్వామి వారిని మంత్రి శనివారం  దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులను ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకొన్న మంత్రి వర్యులకు ప్రేత్యేక పూజలు నిర్వహించి..తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో సింహాచలం 98వార్డ్ అభ్యర్ది వరాంబాబు, సింహాచలం బోర్డ్ సభ్యులు,  స్థానిక నాయకులు , ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ.. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు.  ప్రసాదం స్కిం ద్వారా దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేపడుతున్నామని అన్నారు.

Back to Top