ఉత్త‌రాంధ్ర అభివృద్ధిపై చ‌ర్చ‌కు సిద్ధం

అయ్య‌న్న‌పాత్రుడి స‌వాలుకు మంత్రి అవంతి శ్రీ‌నివాస్ ప్ర‌తి స‌వాలు

విశాఖ‌: ఉత్త‌రాంధ్ర అభివృద్ధిపై చ‌ర్చ‌కు సిద్ధంగా ఉన్నామ‌ని మంత్రి అవంతి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు. టీడీపీ నేత అయ్య‌న్న‌పాత్రుడి స‌వాల్ కు మంత్రి అవంతి ప్ర‌తి స‌వాలు చేశారు. ఎన్నిక‌ల ముందు చెప్ప‌డ‌మే కాద‌ని, ఏడాదిలోనే ఇచ్చిన మాట‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నిల‌బెట్టుకున్నార‌ని చెప్పారు. ఉత్త‌రాంధ్ర అభివృద్ధిపై మేం చ‌ర్చ‌కు సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. త‌న‌పై ఉన్న కేసులు మాఫీ చేసుకునేందుకే గంటా శ్రీ‌నివాస‌రావు వైయ‌స్ఆర్‌సీపీ వైపు మొగ్గు చూపుతున్నార‌ని, అధికారం ఎక్క‌డ ఉంటే గంటా శ్రీ‌నివాస‌రావు అక్క‌డ ఉంటార‌ని విమ‌ర్శించారు. సైకిళ్ల కుంభ‌కోణం, భూ కుంభ‌కోణంలో గంటా, ఆయ‌న అనుచ‌రులు ఉన్నారని ఆరోపించారు. గంటాపై టీడీపీ ప్ర‌భుత్వంలోని ఒక మంత్రే ఫిర్యాదు చేశార‌ని గుర్తు చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top