ఏర్పాటు ఉద్యమాలు రాకూదనే.. మూ డు రాజధానులు

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

విశాఖ‌: పదేళ్ల తర్వాత మళ్లీ ఏర్పాటు ఉద్యమాలు రాకూదని సీఎం వైయ‌స్ జగన్‌ మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనుకుంటున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. పరవాడ సాల్వేషన్‌ కంపెనీలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని  అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.చంద్రబాబు కొన్ని వర్గాలను మాత్రమే చూసి మేలు‌ చేశారని.. జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రభుత్వమని తెలిపారు. వివక్ష, అవినీతి లేకుండా సంక్షేమ పాలన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే పరిశ్రమలు నిర్వహించాలన్నారు. 

ఏడు పర్యాటక ప్రాంతాల్లో ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు..
ప్రతి జిల్లాలో పర్యాటక ప్రాంతాలు ప్రారంభిస్తామని అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. కరోనా కారణంగా పర్యాటక శాఖకు నెలకు రూ.10 కోట్లు చొప్పున రూ.60 కోట్ల నష్టం వచ్చిందన్నారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌ షిప్‌తో 7 పర్యాటక ప్రాంతాల్లో పైవ్ స్టార్ హోటల్స్‌ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
 

Back to Top