విశాఖ‌ను అంత‌ర్జాతీయ న‌గ‌రంగా తీర్చిదిద్దుతాం

ప‌ర్యాట‌క శాఖ మంత్రి అవంతి శ్రీ‌నివాస్‌

విశాఖపట్నం: అంతర్జాతీయ నగరంగా విశాఖను తీర్చిదిద్దుతామ‌ని, పరిపాలనా రాజధానిగా అన్ని హంగులు సమకూర్చబోతున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. భీమిలి‌ నియోజకవర్గంలో మంత్రి అవంతి ప‌ర్య‌టించి మధురవాడలో రూ. 4.5 కోట్లతో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాపనలు చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి అవంతి శ్రీ‌నివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గ‌తేడాది రూ.1000 కోట్ల‌తో అభివృద్ధి ప‌నుల‌కు  శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ఒక్క భీమిలి నియోజకవర్గంలోనే రూ.17 కోట్లతో అభివృద్ధి ప‌నులు చేప‌డుతున్నామ‌న్నారు. విశాఖ నగరంలో మౌలిక వసతులపై దృష్టి పెట్టామ‌ని, శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందడానికి విశాఖ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయ‌న్నారు. రాబోయే రోజుల్లో విశాఖ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయ‌న్నారు.

Back to Top