విద్య‌తో పాటు సంగీతానికి సీఎం వైయ‌స్‌ జ‌గ‌న్ పెద్ద‌పీట 

ప‌ర్యాట‌కశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్
 

 విశాఖ : విద్య‌తో పాటు సంగీతానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పెద్ద‌పీట వేస్తున్నార‌ని, క‌ళాకారుల‌కు పెన్ష‌న్ ఇస్తున్న  ప్ర‌భుత్వం త‌మ‌దేన‌ని ప‌ర్యాట‌కశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. క‌ళాకారుల‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని  వెల్ల‌డించారు. ప‌ద్మ‌భూష‌ణ్ మంగ‌ళంప‌ల్లి బాల ముర‌ళీకృష్ణ 90వ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో ప‌ర్యాట‌కశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, తెలుగు భాషా సంఘం ఛైర్మ‌న్ యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్రసాద్, చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ త‌దిత‌రులు పాల్గొని నివాళులర్పించారు.  ఈ సంద‌ర్భంగా మంత్రి  అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తూర్పుగోదావ‌రి జిల్లా  మారుమూల ప్రాంతంలో జ‌న్మించిన మంగ‌ళంప‌ల్లి ఎంతో మందికి స్పూర్తిదాయ‌కంగా నిలిచార‌ని కొనియాడారు.  చ‌రిత్ర‌లో మంగ‌ళంప‌ల్లి పేరు నిలిచిపోతుంద‌న్నారు. క‌రోనా కార‌ణంగా ఈ సంవ‌త్స‌రం ఆయ‌న జ‌యంతి వేడుక‌ల‌ను సాధార‌ణంగా నిర్వ‌హిస్తున్నామ‌ని ద‌క్షిణాది రాష్ర్టాల్లో సంగీతాన్ని ప‌రిచ‌యం చేసింది మ‌న తెలుగువాళ్లే అని మంత్రి కొనియాడారు. 

తాజా ఫోటోలు

Back to Top