15 కంటైన్‌మెంట్‌ జోన్లలో ఎలాంటి సడలింపులు లేవు

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

విశాఖ: విశాఖపట్నం జిల్లాలో 15 కంటైన్‌మెంట్‌ జోన్లలో ఎలాంటి సడలింపులు లేవని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. కేంద్ర సూచనల మేరకు మరో రెండు వారాలపాటు ఆంక్షలు కొనసాగుతాయని వివరించారు. విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. కంటైన్‌మెంట్‌ జోన్లలో మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ సడలింపులు చేశామన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కంటైన్‌మెంట్‌ కాని జోన్లలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మినహాయింపులు ఉన్నాయని, మండల స్థాయిలో అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఆంక్షల మినహాయింపులపై అక్కడికక్కడే నిర్ణయం తీసుకునే విధంగా చర్యలు చేపట్టామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయదారులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడుతున్నావని వివరించారు.
 

Back to Top