విశాఖ: విపత్కర పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయం చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్న వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై హైదరాబాద్‌లో కూర్చున్న చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. జనం పేరిట చందాలు వసూలు చేసే ఖర్మ వైయస్‌ఆర్ సీపీకి లేదని, ప్రజలు కష్టాల్లో ఉన్న వేళ దాతలు ముందుకొచ్చి సీఎం సహాయ నిధికి, కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ పేరిట చెక్కులు ఇస్తున్నారన్నారు. అసలు విషయాన్ని తెలుసుకోకుండా టీడీపీ నేతలు నీచ రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 63 ఏళ్ల వయసులో వైయస్‌ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి రక్తదానం చేస్తే.. చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. షెల్టర్ హోమ్‌లో సదుపాయాలు పరిశీలిస్తే క్వారంటైన్ సెంటర్‌కి వెళ్లామని టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పడం దారుణం అన్నారు. కరోనా కష్ట సమయంలో హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రజలకు ఏమి ఇచ్చిందని ప్రశ్నించారు. ప్రజల కోసం చంద్రబాబు ఏపీకి రావచ్చు కదా..? క్వారంటైన్ అంటే భయమెందుకని నిలదీశారు.