బాబు, లోకేష్‌ పాస్‌పోర్టులు సీజ్‌ చేయండి

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

విశాఖ: చంద్రబాబు, లోకేష్‌ పాస్‌పోర్టులను తక్షణమే సీజ్‌ చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్‌ను విచారిస్తే రూ. 2 వేల కోట్ల అవినీతి జరిగినట్లుగా తెలుస్తోందని, చంద్రబాబు, లోకేష్‌లను విచారిస్తే ఎన్ని కోట్ల అవినీతి బయటకు వస్తోందనని అనుమానం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్, వారి కోటరీ అడ్డంగా దోచుకున్నారని మండిపడ్డారు. దోచుకున్న సొమ్మునంతా విదేశాలకు తరలించాడన్నారు. చంద్రబాబు, లోకేష్‌లపై ఐటీ దాడులు జరిగితే లక్షల కోట్ల రూపాయల అక్రమాస్తులు బయటకు వస్తాయన్నారు. కేంద్రం దృష్టిసారించాలని కోరారు.

తాజా వీడియోలు

Back to Top