దుర్భుద్ధితోనే విశాఖకు చంద్రబాబు అడ్డుపడుతున్నారు 

మంత్రి అవంతి శ్రీనివాస్‌

విశాఖ జిల్లాకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కావాలని ర్యాలీ

విశాఖ: చంద్రబాబు దుర్భుద్ధితోనే విశాఖకు రాజధాని రాకుండా అడ్డుపడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ విమర్శించారు. ఆయనకు పవన్‌ మద్దతు పలకడం నీచరాజకీయమన్నారు. విశాఖ పట్నం జిల్లాకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కావాలని భారీగా ర్యాలీ చేపట్టారు. శుక్రవారం గాజువాక బీసీ రోడ్డు నుంచి భారీ ర్యాలీ మొదలైంది. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విశాఖకు రాజధాని వస్తే ఉత్తరాంధ్ర వలసలు తగ్గుతాయని చెప్పారు. ర్యాలీలో మంత్రి అవంతి  శ్రీనివాస్‌ పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు ఒక దుర్భుద్ధితో విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ రాజధాని రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రి కావడానికి కారణం ఉత్తరాంధ్ర ప్రజలే అన్నారు.  ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఎప్పుటికీ వెనుకబడి ఉండాలా అని ప్రశ్నించారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని సీఎం వైయస్‌ జగన్‌ చెబుతుంటే..చంద్రబాబు మాత్రం కేవలం 29 గ్రామాలే అభివృద్ధి చెందాలని దుర్భుద్ధితో అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. అలజడులు సృష్టించి, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు తానా అంటే పవన్‌ తందానా అంటున్నారని విమర్శించారు. పవన్‌కు ఉత్తరాంధ్రపై ప్రేమ లేకపోతే గాజువాకాలో ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. అమరావతిలో పోటి చేయాల్సిందన్నారు. ఉత్తరాంధ్రను వ్యతిరేకించడం పవన్‌కు తగదన్నారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఇస్తామంటే పవన్‌ హర్షించాల్సింది పోయి వ్యతిరేకించడం సరికాదు. కమ్యూనిస్టులకు కూడా ఈ ప్రాంతం కంచుకోట అని ..వారు కూడా విశాఖకు మద్దతు పలకాలన్నారు. విశాఖవాసులు టీడీపీకి 4 ఎమ్మెల్యేలను గెలిపించారని గుర్తు చేశారు. చంద్రబాబుకు మంచి బుద్ధి కలగాలని ఆయన ఆకాంక్షించారు.  

Back to Top