విశాఖలో ప్రభుత్వ ఇసుక రీచ్ ప్రారంభం

కొత్త పాలసీపై కసరత్తు జరుగుతోంది

 మంత్రి అవంతి శ్రీనివాస్  

విశాఖ: ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఇసుక పాలసీపై కసరత్తు జరుగుతోందని ఏపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్(అవంతి శ్రీనివాస్) తెలిపారు. ఇసుక పాయింట్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇసుకను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. రెవెన్యూ, మైనింగ్ శాఖలు ఈ బాధ్యతలను సంయుక్తంగా చూస్తాయని పేర్కొన్నారు. 

విశాఖపట్నంలోని ముడుసర్ లోవలో ఈరోజు ప్రభుత్వ ఇసుక రీచ్ ను అవంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తెచ్చేవరకూ పాత విధానమే నడుస్తుందని తెలిపారు. ఇసుక పాలసీ విధివిధానాలను రాబోయే రెండ్రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. 

తాజా ఫోటోలు

Back to Top