బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటాం

 టగ్‌ బోటు ప్రమాద బాధితులకు మంత్రి అవంతి శ్రీనివాస్‌ పరామర్శ 

విశాఖపట్నం: టగ్ బోటు అగ్ని ప్రమాదంలో గాయపడి.. మై క్యూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంగళవారం మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్‌ పరామర్శించారు. బాధితులకు నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశ్రమలు నిప్పుల కుంపటిగా ఉండకూడని.. భద్రత చర్యలు పాటించాలన్నారు. సంఘటన దురదృష్టకరమని.. ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందన్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను చెప్పామన్నారు. ప్రమాదంపై విచారణ జరుగతుందని వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. దీనిపై హెచ్‌పీసీఎల్‌, పోర్ట్‌ అధికారులతో మాట్లాడతామని అవంతి తెలిపారు.

Back to Top