నదీ పరివాహక ప్రాంతంలో బోటింగ్‌పై మంత్రి అవంతి సమీక్ష

విజయవాడ: నదీ పరివాహక ప్రాంతంలో బోటింగ్‌పై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జీపీఎస్, లైఫ్‌ జాకెట్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు కచ్చితంగా ఉండాలని సూచించారు. చంద్రబాబు, లోకేష్‌ ప్రతి విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. టూరిజం ప్రమోషన్‌ను రాజకీయాలతో ముడిపెట్టవద్దని హితవు పలికారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top