ఆగస్టు 16 నుంచి స్కూల్స్‌ రీఓపెన్‌

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడి

తాడేపల్లి: ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. విద్యా రంగంలో ‘నాడు నేడు’, జగనన్న విద్యా కానుకపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడారు. ఈనెల 12 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రెండేళ్లలో ఫౌండేషన్‌ స్కూళ్లకు అదనపు గదులు నిర్మిస్తామని తెలిపారు. 30 శాతం పదో తరగతి, 70 శాతం ఇంటర్‌ ఫస్టియర్‌ మార్కులు ప్రాతిపదికగా ఇంటర్‌ విద్యార్థులకు మార్కుల కేటాయిస్తామన్నారు. ఈ నెలాఖరులోపు విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామన్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top