జవాబుదారీతనం..అభివృద్ధికి నూతన నిర్వచనం ‘జగనన్న సురక్ష’

మంత్రి ఆదిమూలపు సురేష్‌

తాడేపల్లి: జవాబుదారీతనం..అభివృద్ధికి నూతన నిర్వచనం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమమని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు.

మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఏమన్నారంటే..
నిత్యం ప్రజల సంతోషం కోసం పరితపిస్తూ..మనమంతా ప్రజా సేవలకులమని, జనానికి మనం జవాబుదారీతనంతో పని చేద్దామని మమ్మల్ని నడిపిస్తూ..రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న మనసున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, సహచర మంత్రులకు, అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు
ప్రతిపక్షాలు ఎన్ని చేసినా, ఎంత భారమైనా భరిస్తూ పసిబిడ్డలను దగ్గర నుంచి పండు ముసలి వరకు ఉపయోగపడే ఎన్నో పథకాలు వైయస్‌ జగన్‌ గారు తీసుకువచ్చారు. ఒక నానుడి ఉంది..అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. కానీ అడగకముందే జనం సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తున్న జగనన్నకు జనం జేజేలు పలుకుతున్నారు. ఎన్నో పథకాలకు రూపుకల్పన  చేస్తూ పథకాలను కొనసాగిస్తున్న వైయస్‌ జగన్‌కు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మీకు రుణపడి వుంటారు. ఈ రోజు ప్రజల కోసం మరో చారిత్రత్మాక కార్యక్రమం జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభిస్తున్న శుభ తరుణంలో మీకు రాష్ట్ర ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతల తెలియజేస్తున్నా సర్‌..
ఇప్పటికే మమ్మల్ని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు పంపించి వారి సమస్యలు తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ ప్రజలు వారి సమస్యలు సీఎం కు చెప్పుకునేలా జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు జగనన్న సురక్ష ద్వారా ఇంకా పరిష్కారం కాని సమస్యలకు జవాబుదారితనంతో జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. 
జవాబుదారీతనం అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఏమిటి అనే దానికి నూతన నిర్వచనం పలుకుతూ వైయస్‌ జగన్‌ చేస్తున్న కార్యక్రమాలు యావత్‌ భారత దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని సవినయంగా మనవి చేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు నా జన్మధన్యమైంద. జన్మజన్మలకు మీకు రుణపడి ఉంటానని, ఇటువంటి నాయకుడి వద్ద పని చేయడం గర్వంగా ఫీల్‌ అవుతున్నానని మంత్రి ఆదిమూలపు సురేష్‌  పేర్కొన్నారు. 
 

Back to Top