జూలై 20లోగా మున్సిపాలిటీ రోడ్ల అభివృద్ధి

నాడు–నేడు కింద గ్యాలరీ ప్రదర్శన

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

తాడేపల్లి: రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జీలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తిచేయాలని, నిడదవోలు, గుంటూరు ఫ్లైఓవర్‌ పనులను త్వరితగతిన ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. రోడ్ల మరమ్మతులు, నిర్మాణంపై సీఎం సమీక్ష అనంతరం సీఎం క్యాంపు కార్యాలయంలోని మీడియా పాయింట్‌ వద్ద మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడారు. 

సమగ్రమైన ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ తయారు చేసుకొని పంచాయతీ రాజ్‌ పరిధిలోని 26 వేల పైచిలుకు కిలోమీటర్ల రోడ్లను మొత్తాన్ని కంప్లీట్‌ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు. నిన్న జరిగిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సమీక్షలో ఆదేశాల మేరకు ప్రతీ మున్సిపాలిటీలో జూలై 20లోగా అన్ని రోడ్లు అభివృద్ధి చేసి నాడు–నేడు కింద గ్యాలరీ ప్రదర్శించాలని సీఎం ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top