అణగారిన వర్గాలకు అండగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

సామాజిక సాధికార యాత్ర‌లో మంత్రి ఆదిమూల‌పు సురేష్‌

ప‌ల్నాడు:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అణ‌గారిన వ‌ర్గాల‌కు అండ‌గా నిలిచార‌ని మంత్రి ఆదిమూల‌పు సురేష్ కొనియాడారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఎమ్మెల్యేబొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో మంగ‌ళ‌వారం సామాజిక సాధికార‌ బస్సుయాత్రనిర్వ‌హించారు. వినుకొండ రూరల్‌ మండలం విఠంరాజుపల్లిలో సుజికీ కార్‌ షోరూమ్‌ వద్ద కార్యకర్తలో కలిసి పార్టీ నేతల పాదయాత్ర ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2019 లాగానే, 2024లోనూ వైయ‌స్ఆర్‌ సీపీకి పట్టం కట్టాలి.. మళ్లీ సీఎంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డే ఉండాలని ఆకాక్షించారు.  టీడీపీ పాలనలో అబద్ధపు హామీలు ఇచ్చి నట్టేట ముంచారని విమర్శించారు. పేదల గుండె తడి తెలిసిన సీఎం వైయ‌స్ జగన్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నా రు.

గతంలో పేదలకు అందని ఇంగ్లీష్ విద్యా, అణగారిన వర్గాలకు ఇప్పుడు అందుతుందన్నారు.. గొప్ప పదవుల్లో పేదలు, అణగారిన వర్గాలు ఉంటున్నారు.. గతంలో సామాజిక సాధికార అంశం ఓటు బ్యాంకుగా ఉండేదన్నారు. అయితే, ఇప్పుడు ప్రతి పేదవాడికి మేలు జరిగిందా లేదా? ప్రజలు ఆలోచించాలని సూచించారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ సమాజంలో సంపద సృష్టిస్తున్నారు.. స్థూల ఉత్పత్తిలో మెరుగైన స్థానాన్ని ఏపీ సాధించింది.. మళ్లీ వైసీపీకి పట్టం కట్టాలి.. వైయ‌స్ జగనే సీఎంగా ఉండాల‌ని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.

మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చంద్రబాబు వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలు మోసానికి గురి అయ్యారు.. వైయ‌స్ జగన్ పాలనలో అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు వస్తున్నాయన్నారు.. మళ్లీ పేదలను మోసం చేయడానికి చంద్రబాబు ఎత్తులు వేస్తున్నాడు అని మండిపడ్డారు. అంబేడ్కర్, జ్యోతి రావ్ పులే ఆశయాల సాధనకు కృషి చేస్తున్న సీఎం వైయ‌స్  జగన్ కు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు మంత్రి పదవులు ఇచ్చిన నాయకుడు సీఎం వైయ‌స్ జగన్.. లక్షా డెబ్బై ఆరువేల కోట్ల రూపాయలకు పైగా బడుగు వర్గాలకు ఇచ్చారని తెలిపారు. దుష్ట చతుష్టయం నుండి  వైయ‌స్‌జగన్ ను కాపాడు కోవాలి.. వైయ‌స్ జగన్ మరో సారి సీఎం కావాలి అని మంత్రి మేరుగ నాగార్జున ఆకాక్షించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక యాత్ర సాగుతుంది.. మూడు ప్రాంతాల ప్రజలు యాత్రను జయప్రదం చేస్తున్నార‌ని ఎమ్మెల్సీ కుంభ రవి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ,సామాజిక వర్గాల ప్రజలు యాత్రలో పాల్గొంటున్నారు.. తర తరాలుగా అణిచివేతకు గురైన వర్గాలు, సీఎం వైయ‌స్  జగన్ అండతో సాధికారత సాధిస్తున్నారని తెలిపారు. 75 ఏళ్ల చరిత్రలో నా ఎస్సీలు, నా బీసీలు అన్న ముఖ్య మంత్రి లేరు.. ఒక్క వైయ‌స్ జగన్ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ చేస్తున్న పనులు, ప్రజలకు అవగాహన కలిగించాలి అనే ధ్యేయంతో సాధికార యాత్ర చేస్తున్నామ‌న్నారు.

ప్రభుత్వ స్కూళ్లలో ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియం విద్యా అందుబాటులోకి వచ్చిందని ఆయ‌న తెలిపారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎంపీలు విజయసాయిరెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు.. మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Back to Top