ఇసుకపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం

మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌
 

నెల్లూరు: పవన్‌ పింక్‌ అనే సినిమా రీమేక్‌ చిత్రంలో నటిస్తున్నారని కథనాలు వస్తున్నాయని, దీన్నిబట్టి చూస్తే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన బాగుందని ఆయన ఒప్పుకున్నట్లే అని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. నిన్న విశాఖలో నిర్వహించిన లాంగ్‌మార్చ్‌పై ఆయన స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌ తీరు సరిగా లేదని పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ పాలన బాగుంటే సినిమాలు చేసుకుంటానన్న పవన్‌..ఇప్పుడు  సినిమాకు ఒప్పుకున్నారని, దీన్ని బట్టి పవన్‌ పరోక్షంగా వైయస్‌ జగన్‌ బాగుందని ఒప్పుకున్నట్లే అన్నారు.  ఇసుకపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ఫైర్‌ అయ్యారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. 

Read Also: క్రెడిట్ కోసం పవన్ నాయుడి పాట్లు

తాజా ఫోటోలు

Back to Top