అన్ని ప్రాంతాలు బాగుండాలని ఆలోచన చేసే వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌

మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌

నిబంధనలకు లోబడే ప్రాజెక్టులు కడుతున్నాం

ఏపీకి కేటాయించిన నీటినే వాడుకుంటున్నాం

విద్యుత్‌ ఉత్పత్తి కారణంగా కృష్ణా జలాలు వృథా అవుతున్నాయి

తెలంగాణ ప్రభుత్వ తీరును ఏపీ కేబినెట్‌ తప్పుబట్టింది

తెలంగాణ తీరుపై ప్రధానికి, జలశక్తి మంత్రికి లేఖ రాస్తాం

అమరావతి: అన్ని ప్రాంతాలు బాగుండాలని ఆలోచన చేసే వ్యక్తి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ తెలిపారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతి లేకుండానే ప్రాజెక్టులు కడుతుందని విమర్శించారు. శ్రీశైలం జలాశయం వద్ద నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు. ఇరిగేషన్‌ అవసరాలు తర్వాత విద్యుత్‌ ఉత్పత్తి చేయాలన్నారు. శ్రీశైలం డ్యామ్‌ నిండకూడదనే దుర్మార్గమైన చర్య జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ తీరును ఈ రోజు కేబినెట్‌ తప్పుబట్టిందన్నారు. మంత్రి పేర్నినానితో కలిసి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. 

కృష్ణా బేసిన్‌లో కేవలం 15 రోజులు మాత్రమే 880 అడుగులపైన నీటి లభ్యత ఉంటుందన్నారు. ఈ అంశాలను అపెక్స్‌ కౌన్సిల్‌ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లామన్నారు. రాజకీయ ప్రయోజనాలు, భావోద్వేగాలను రెచ్చగొట్టడం సరికాదని హితవు పలికారు. మా కేటాయింపులకు లోబడే ప్రాజెక్టులు కడుతున్నామన్నారు. 
తెలంగాణ ప్రభుత్వ తీరును అందరూ గమనిస్తున్నారు. ఈ రోజు సీఎం వైయస్‌ జగన్‌ మొదటి నుంచి కూడా స్పష్టంగా చెబుతున్నారు. ఏపీకి కేటాయించిన వాటా మేరకే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. ఏపీ నీళ్లు తీసుకోవాలంటే..రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలకు నీరు వెళ్లాలంటే పోతిరెడ్డి పాడు నుంచి తీసుకోవాలి. శ్రీశైలం జలాశయంలో 885 అడుగుల వద్దనే నీరు  తీసుకోగలం. కనీసం 848 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి  నీళ్లు తీసుకోవచ్చు.  తెలంగాణ ప్రభుత్వానికి 800 అడుగుల వద్ద నీరు తీసుకునే వీలుంది. అతితక్కువ సమయంలోనే వరద నీటిని డ్రా చేసుకోగలం. అనేక సార్లు అపేక్స్‌ కమిటీలో ఈ విషయాన్ని చెప్పాం. గత కొంత కాలంగా తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. మేం కూడా ఇలాంటి భాషను మాట్లాడగలం. మాకు చేతకాక కాదు. ఇది చాలా సుున్నితమైన అంశం.  రెండు ప్రాంతాల తెలుగు ప్రజలు విడిపోయిన తరువాత కూడా అందరూ బాగుండాలని ఆలోచన చేసే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఏ ప్రాజెక్టు కట్టినా కూడా మాకు కేటాయించిన వాటా నుంచే తీసుకుంటామని ఆనేక సార్లు చెప్పినా కూడా తెలంగాణ దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతోంది. విద్యుత్‌ ఉత్పత్తి కారణంగా నీరు వృథా అవుతోంది. శ్రీశైలానికి ఈ రోజు 30 వేల క్యూసెక్కుల నీరు వస్తుంటే అందులో 26 వేల క్యూసెక్కుల నీటిని విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. శ్రీశైలం డ్యామ్‌ నిండకుండా దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు.  కేంద్రం పవర్‌ జనరేషన్‌ చేయవద్దని ఆదేశాలు జారీ చేసినా కూడా పట్టించుకోకుండా జీవోను విడుదల చేసి విద్యుత్‌ ఉత్పత్తి చేయడం సరికాదు. దీనిపై ఈ రోజు కేబినెట్‌ భేటీలో తీర్మానం చేశాం. కేంద్రానికి లేఖ రాస్తున్నాం. ఎంతదూరమైన వెళ్తామని, మేం కామ్‌గా ఉన్నామంటే అది మా చేతకాని తనం కాదు. తెలంగాణ ప్రభుత్వ చర్యలను తప్పకుండా అడ్డుకుంటామని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రాజెక్టు కడుతోందని, ఏ ఒక్కదానికి అనుమతులు లేవన్నారు. విద్యుత్‌ ఉత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా చేస్తోందని, వారికి కేటాయించిన నీటి వాటాను కుదించాలని కేంద్రాన్ని కోరుతామని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. 
 

Back to Top