తిరుపతి ఎంపీ సీటును సీఎం వైయస్‌ జగన్‌కు కానుకగా ఇస్తాం

మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌

నెల్లూరు:  తిరుపతి ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కానుకగా ఇవ్వబోతున్నామని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. డాక్టర్‌ గురుమూర్తి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనిల్‌కుమార్‌ మాట్లాడారు. వైయస్‌ జగన్‌ ఆశీస్సులతో గురుమూర్తి నామినేషన్‌ దాఖలు చేస్తున్నారు. నామినేషన్‌ కేవలం ఆర్భాటాలు లేకుండా దాఖలు చేస్తున్నా..వేలాది మంది స్వ^è ్ఛందంగా తరలివచ్చారు. వైయస్‌ జగన్‌పై ఉన్న నమ్మకం ఉట్టి పడుతుంది. ఈ ఎన్నికల్లో దాదాపు 5 లక్షల మెజారిటీతో గెలుపొందబోతున్నాం. వైయస్‌ జగన్‌కు ఎంపీ స్థానాన్ని కానుకగా ఇవ్వబోతున్నాం. టీడీపీ ఇప్పటికే చేతులు ఎత్తేసింది. వైయస్‌ జగన్‌ పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఇటీవల నిర్వహించిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ విజయదుందుభి మోగించింది. ఇవే ఫలితాలు తిరుపతి ఉప ఎన్నికలో పునరావృతం కాబోతున్నాయని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు.
 

తాజా ఫోటోలు

Back to Top