సుంకేసుల బ్యారేజ్‌ను సంద‌ర్శించిన మంత్రి అనిల్ కుమార్‌

క‌ర్నూలు:  రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ యాద‌వ్  సోమ‌వారం  సుంకేసుల బ్యారేజ్ ను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్ని వేల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వస్తుంది, ఎన్ని వేల క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి వదులుతున్నారు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గేట్ల ద్వారా దిగువ ప్రాంతాలకు విడుదల చేసిన నీటిని, కెనాల్ కు విడుదల చేసిన నీటిని పరిశీలించి ఎన్ని వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు వంటి వివరాలను జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్టు మురళి నాథ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆయ‌న వెంట కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్,  తదితరులు ఉన్నారు.

Back to Top