చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సూచన

నెల్లూరు: దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా స్కూళ్లను అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. నెల్లూరులోని రామ్మూర్తి నగర్, ఏఎస్‌నగర్‌లో ‘నాడు–నేడు’ పనులను మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఇంట్లో కూర్చొని విమర్శలు చేయడం కాదు.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. జూమ్‌ మీటింగ్‌లో ఆరోపణలు చేయడం కాదు.. ఒకసారి స్కూళ్ల అభివృద్ధిని చూడాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తుందో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు తెలుసుకోవాలన్నారు. టీడీపీ హయాంలో పింఛన్ల కోసం వృద్ధులు చెప్పులు అరిగేలా జన్మభూమి కమిటీల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగేవారన్నారు. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో పెన్షన్‌ డబ్బులు గుమ్మం ముందుకే వస్తున్నాయన్నారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు డోర్‌ డెలివరీ జరుగుతున్నాయని చెప్పారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన చేస్తున్నారని వివరించారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top