చట్టం అందరికీ సమానమే

మండలిలో టీడీపీ సభ్యుల తీరును ఖండించిన మంత్రి అనిల్‌
 

అమరావతి: చట్టం అందరికీ సమానమే అని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ స్పష్టం చేశారు. శాసన మండలిలో టీడీపీ సభ్యుల తీరును మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ ఖండించారు.తప్పు చేసింది బీసీ అయితే అరెస్టు చేయకూడదా అని ప్రశ్నించారు.ఈఎస్‌ఐ స్కామ్‌లో రూ.150 కోట్లకు పైగా అవినీతి జరిగిందన్నారు. దొంగలా ఇంట్లో దాక్కుని తాళాలు వేసుకుంటే పోలీసులు వెళ్లాలా అని నిలదీశారు.

గడ్డాలు ఉంటే రౌడీలేనా?
గడ్డాలపై టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌  తప్పుపట్టారు. మండలి చైర్మన్, చంద్రబాబుకు కూడా  గడ్డం ఉందని గుర్తు చేశారు. గడ్డం ఉంటే రౌడీలేనా అని ఆయన ప్రశ్నించారు.
 

Back to Top