స‌ర్వేప‌ల్లి కాల్వ‌ల‌ను ప‌రిశీలించిన మంత్రి అనిల్‌

నెల్లూరు: స‌ర్వేప‌ల్లి కాల్వ‌ల‌ను  మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ గురువారం ప‌రిశీలించారు. ప‌నుల్లో వేగం పెంచాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.  జ‌న‌వ‌రి క‌ల్లా ప‌నులు పూర్తి చేస్తామ‌ని మంత్రి చెప్పారు. 
కాల్వ గట్టుపై ఉన్న నిర్వాసితుల‌తో మాట్లాడిన మంత్రి.. ఎవ‌రి ఇంటిని తొల‌గించ‌మ‌ని హామీ ఇచ్చారు. టీడీపీ నేత‌ల మాట‌లు న‌మ్మొద్ద‌ని మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్  హిత‌వు ప‌లికారు.

Back to Top