పోలవరం పనులు యజ్ఞంలా నిర్వహిస్తున్నాం

కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన మంత్రి అనిల్, ఎంపీ మిథున్‌రెడ్డి

ఢిల్లీ: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, లోక్‌సభ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పోలవరం ప్రాజెక్టు నిధులు, తదితర ప్రాజెక్టుల అంశాలుపై కేంద్రమంత్రితో చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరామని, రెండు మూడు రోజుల్లోనే నిధులు విడుదల చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారన్నారు. రూ.4వేల కోట్ల పోలవరం బకాయిలు త్వరగా విడుదల చేస్తామని చెప్పారన్నారు. పోలవరం పనులను సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓ యజ్ఞంలా నిర్వహిస్తున్నారని, 2021 డిసెంబర్‌ కల్లా పోలవరం పూర్తి చేయాలనేది సీఎం లక్ష్యమన్నారు. 

పునరావాసం ప్యాకేజీని త్వరితగతిన విడుదల చేయాలని కేంద్రమంత్రిని కోరామని, అదే విధంగా కృష్ణా ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు జరిగే ప్రయోజనాలను వివరించామన్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం తేదీ త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారన్నారు. 
 

Back to Top