కరోనా వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌
 

 నెల్లూరు జిల్లా: కరోనా వస్తే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ ధైర్యం చెప్పారు. చికిత్స అందించేందుకు కోవిడ్ ఆసుపత్రుల్లో మరిన్ని అధునాతన సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. కరోనా బాధితులకు మరిన్ని సేవలు అందిస్తామని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..రోజుకు ఆరువేల కరోనా నిర్ధారణ  పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి సత్వరమే చికిత్స అందిస్తున్నామని తెలిపారు. గూడూరు, నాయుడుపేటలో కరోనా పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.  మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ కోరారు.
 

తాజా వీడియోలు

Back to Top