లోకేష్‌ వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనం 

ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌
 

 నెల్లూరు: చంద్రబాబు ఒక అబద్ధం చెబితే.. లోకేష్‌ పది చెబుతున్నారని రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ...వరదలు ముంచెత్తి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. వారిని పరామర్శించకుండా ట్వీట్‌లకే పరిమితమయ్యారని విమర్శించారు. పడవను అడ్డుపెట్టి చంద్రబాబు ఇంటిని ముంచివేశారనే లోకేష్‌ వాఖ్యలు అజ్ఞానానికి నిదర్శనం అని దుయ్యబట్టారు. నెల్లూరు నగరంలో పేదల ఇళ్లు తొలగించే ప్రసక్తే లేదని మంత్రి అనిల్‌  స్పష్టం చేశారు.

Back to Top