రామోజీ.. ఆ డ్యామేజీ వాస్తవం నీకు తెలియదా..?

ఆ ముగ్గురు.. మనషుల రూపంలో ఉన్న దెయ్యాలు

ప్రజలకు మంచి జరిగితే.. బాబు, రామోజీ, రాధాకృష్ణ ఓర్వలేరు

డయాఫ్రం వాల్‌ ఎవరి హయాంలో నిర్మించారో రాస్తే బాగుండేది

వార్త రాసేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని రాయండి.. రామోజీ

ప్లానింగ్‌ ప్రకారం నిర్మించకపోవడంతోనే డయాఫ్రం వాల్‌ డ్యామేజీ 

చంద్రబాబు హయాంలో అడ్డదిడ్డంగా పోలవరం నిర్మాణం

ప్రైవేటీకరణకు ఆద్యుడు చంద్రబాబే..

ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ధ్వజం

తాడేపల్లి: పోలవరం ప్రాజెక్టులోని డయాఫ్రం వాల్‌ డ్యామేజీ అయ్యిందని రాసిన రామోజీరావు.. ఏ విధంగా, ఎందుకు కొట్టుకుపోయిందోనని ఎందుకు రాయలేకపోయారని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు. 2018లో చంద్రబాబు అధికారంలో ఉండగా డయాఫ్రం వాల్‌ నిర్మించారని, బాబు ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే డ్యామేజీ అయ్యిందని ఎందుకు రాయలేకపోయారని నిలదీశారు. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణలు మనషుల రూపంలో ఉన్న దెయ్యాలు అని, ప్రజల తలరాతలు మారుతుంటే చూసి తట్టుకోలేనిపోతున్నారన్నారు. ప్రజలకు మంచి జరుగుతుంటే ఏదో ఒక దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘పోలవరం ప్రాజెక్టు ఒక ప్లానింగ్‌ ప్రకారం కట్టాల్సింది పోయి. అతుకులు అతుకులుగా కట్టడం వల్ల ఈ రోజు ఇవన్నీ జరుగుతున్నాయి. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పూర్తిచేసిన తరువాత నీటిని డైవర్ట్‌ చేసిన తరువాత కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేసిన తరువాత డయాఫ్రం వాల్‌ కట్టి ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ, గత ప్రభుత్వం స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ సగం, కాఫర్‌ డ్యామ్‌ సగం, మధ్యలో డయాఫ్రం వాల్‌ సగం ఇష్టానుసారంగా నిర్మించింది. 

లక్షలాది క్యూసెక్కుల వరద వస్తుందని తెలిసి కూడా అడ్డదిడ్డంగా ప్రాజెక్టు నిర్మించడం వల్ల వచ్చిన ఫ్లడ్‌లో దాదాపు 1.4 కిలోమీటర్ల లెన్త్‌లో 185 మీటర్ల డయాఫ్రం వాల్‌ డ్యామేజ్‌ అయ్యింది. వాస్తవానికి ఎందుకిలా జరిగిందని రామోజీరావు కారణాలు రాసి ఉంటే బాగుండేది. గతంలో రామోజీరావు బంధువుల కాంట్రాక్ట్‌లోనే, చంద్రబాబు ప్లానింగ్‌ లేకుండా కట్టారని రాసి ఉంటే ఇంకా బాగుండేది. 

ఈ ప్రభుత్వం తప్పిదాల వల్ల డయాఫ్రం వాల్‌ డ్యామేజీ జరిగిందన్నట్లుగా రామోజీరావు రాయడం బాధాకరం. సీఎం వైయస్‌ జగన్‌ మొదటి సమీక్షలోనే చెప్పారు. స్పిల్‌ వే కట్టిన తరువాత ప్లానింగ్‌ ప్రకారం కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేసుకొని తరువాత డయాఫ్రం వాల్‌ కట్టాల్సిందని చెప్పారు. గత ప్రభుత్వం చేపట్టిన సగం.. సగం నిర్మాణాల వల్ల ఈ విధమైన డ్యామేజీలు జరిగాయి. 

స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ను మే మాసంలో పూర్తి చేసి.. కాఫర్‌ డ్యామ్‌ మొత్తం పూర్తిచేసిన తరువాత ఫ్లడ్‌ అనేది ఆ ప్రాంతంలోకి తాకకుండా.. తరువాత డయాఫ్రం వాల్‌ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. రామోజీ రావుకు ఒక వార్త రాసేటప్పుడు.. సగం.. సగం కాకుండా.. నిజనిజాలతో వార్త రాస్తే బాగుంటుంది. కారణాలు లేకుండా అబద్ధపు ప్రచారాలతో రామోజీరావు మునిగితేలుతున్నారు. పోలవరం పూర్తి చేయాలని చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉంది.. ప్లానింగ్‌ ప్రకారం ప్రాజెక్టును పూర్తిచేస్తాం. 

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబుకు సడన్‌గా విశాఖపై ప్రేమ పుట్టుకొచ్చింది. పరిపాలన రాజధానిగా విశాఖను పూర్తిగా వ్యతిరేకించిన వీరు.. సడన్‌గా విశాఖపై ప్రేమ చూపిస్తున్నారు. విశాఖ ప్లాంట్‌ను సీఎం వైయస్‌ జగన్‌ ప్రైవేటీకరణ చేస్తున్నట్లుగా నానా రకాల అబద్ధపు కూతలు కూస్తున్నారు. ఆ ప్రపోజల్‌ వచ్చిన వెంటనే సీఎం వైయస్‌ జగన్‌ ప్రధానికి లేఖ రాశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నిన్న కూడా ఒక లేఖ రాశారు. అఖిలపక్షం, ట్రేడ్‌ యూనియన్‌తో వస్తాం.. అపాయింట్‌మెంట్‌ ఇవ్వండి అని సీఎం అడిగితే.. అది వదిలేసి విశాఖలో అల్లకల్లోసం సృష్టించాలని చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నారు. రామోజీరావు కేవలం వారి సామాజికవర్గ మేలు కోరే వ్యక్తి మాత్రమే. 

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 50 సంస్థలను అమ్మేశారు. ఆనాడు నష్టాల్లో ఉన్న సంస్థను అమ్మడం కరెక్టేనని ఇదే ఈనాడు పత్రిక రాసింది. 2004లో ఒక పుస్తకం రాసి.. ఏ విధంగా ప్రైవేటీకరణ చేశాడో చంద్రబాబు రాశాడు. ప్రైవేటీకరణ చేయడంలో ఆద్యుడైన చంద్రబాబు ఏమొహం పెట్టుకొని గాజువాకలో మాట్లాడుతున్నాడు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ గురించి మాట్లాడేందుకు చంద్రబాబుకు సిగ్గుండాలి’ అని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు.  
 

Back to Top