నెల్లూరు: ఏపీలో కొత్తగా 14 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ వెల్లడించారు. నెల్లూరులో గురువారం 108, 104 వాహనాలను జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైద్యరంగానికి సీఎం వైయస్ జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. ఒకేసారి 1088 కొత్త 108, 104 వాహనాలను ప్రారంభించి రికార్టు సృష్టించారని తెలిపారు. 108, 104 సిబ్బంది జీతాలను కూడా పెంచారని చెప్పారు.