పేదల బిడ్డలు ఇంగ్లీష్‌ మీడియం చదువుకోకూడదా?

ఇంగ్లీష్‌ మీడియం అమలును హైకోర్టు అడ్డుకుందని టీడీపీ శునకానందం 

టీడీపీ నేతల పిల్లలు ఏ మీడియం చదువుతున్నారు

పేద పిల్లలు రాబోయే 20 ఏళ్లలో ప్రపంచంతో పోటీ పడాలన్నదే సీఎం లక్ష్యం

కరోనా సమయంలో టీడీపీ నేతలు ఎక్కడా?

చంద్రబాబు వయసు మళ్లింది కాబట్టే ఆయన ఇంట్లో ఉండొచ్చు..లోకేష్‌ ఎక్కడ?

ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నలకు రమేష్‌ కుమార్‌ సమాధానం చెప్పాలి

మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌

తాడేపల్లి: పేదల బిడ్డలు ఇంగ్లీష్‌ మీడియం చదువుకోకూడదా అని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ టీడీపీ నేతలను ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలును హైకోర్టు అడ్డుకుందని టీడీపీ నేతలు శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. పేదలకు ఉన్నత విద్యను అందించాలని సీఎం వైయస్‌ జగన్‌ తపన పడుతున్నారని, టీడీపీ నేతలు తమ పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అనిల్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు.

దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌
కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో చిత్తశుద్ధితో పని చేస్తుందని అనిల్‌కుమార్‌యాదవ్‌ తెలిపారు. సీఎం వైయస్‌ జగన్‌ ముందు చూపు చర్యలతో దేశంలోనే కరోనా కట్టడిలో ఏపీ ముందు ఉందని జాతీయ పత్రికలు కథనాలు రాశాయని వివరించారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తుంటే హైదరాబాద్‌లో దాక్కున్న చంద్రబాబు తన చెంచాలను అడ్డుపెట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వయసు మళ్లింది కాబట్టి ఇంట్లో ఉండొచ్చని, అయితే పక్క రాష్ట్రంలో కూర్చొని రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఆయన కుమారుడు లోకేష్‌ ఎక్కడున్నారని ప్రశ్నించారు. కరోనా సమయంలో టీడీపీ నేతలు ఎక్కడున్నారని, ఒక్కరికైనా సాయం చేశారా అని నిలదీశారు. 

మీకో న్యాయం..పేదల పిల్లలకు మరో న్యాయమా?
టీడీపీ నేతలు, పత్రికాధినేతలు తమ పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారని మంత్రి అనిల్‌ ప్రశ్నించారు. పేద పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియంలో చదువులు చెప్పించాలని సీఎం వైయస్‌ జగన్‌ తపన పడుతుంటే టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కోర్టు వద్దని చెప్పిందని శునకానందం పొందుతున్నారన్నారు. చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ను  అమెరికాలో చదివించుకోవచ్చు..ఆయన మనవడు దేవాన్ష్‌ను తెలుగు మీడియంలో చేర్పిస్తారా అని ప్రశ్నించారు.  మీకో న్యాయం, పేదలకు మరో న్యాయమా అని నిలదీశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఇంగ్లీష్‌ మీడియం అమలు చేస్తామని, రాబోయే 20 ఏళ్లలలో మన రాష్ట్రంలోని పేద పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా చేస్తామన్నారు. 

ఆ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పు?
వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వేసిన మూడు ప్రశ్నలకు మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సమాధానం చెప్పాలని అనిల్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. నిన్నటి దాకా కేంద్రానికి లేఖ రాసింది తానేనని ఒప్పుకొని రమేష్‌ కుమార్‌ ..విజయసాయిరెడ్డి ప్రశ్నించగానే తానే అని ఒప్పుకున్నారన్నారు. వాస్తవానికి ఆ లేఖ టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర డ్రాప్ట్‌ చేశారని, ఎక్కడ తమ బంఢారం బయటపడుతుందోనని భయంతో తానే లేఖ రాశానని రమేష్‌ ఒప్పుకున్నారన్నారు. ప్రపంచమంతా కరోనా వైరస్‌తో బాధపడుతుంటే చంద్రబాబుకు మాత్రం ఎల్లో వైరస్‌ వ్యాపించిందన్నారు. పక్క రాష్ట్రంలోనైనా ప్రశాంతంగా ఉండకపోతే ఈసారి 23 సీట్లు వచ్చాయి, వచ్చే ఎన్నికల్లో ఈ  అంకే తారుమారు అయి మూడుకు పరిమితం కావాల్సి వస్తుందని అనిల్‌కుమార్‌ యాదవ్‌ హెచ్చరించారు.
 

Back to Top