అచ్చెన్నాయుడు దోపిడీపై విచారణ చేస్తే బీసీ అంటారా..?

మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌
 

అమరావతి: అచ్చెన్నాయుడు దోపిడీపై విచారణ చేస్తే బీసీ అంటారా..ఇదేమీ న్యాయమని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ ప్రశ్నించారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగింది.అవినీతి చేసి కులాలను పైకి తీసుకొస్తున్నారు. అచ్చెన్నాయుడిపై విచారణ జరిగితే..ఆయన సచ్ఛీలుడైతే, సత్యహరిశ్చంద్రుడిలా బయటకు వస్తారు. దానికి భయమెందుకు, ఉలుకెందుకు?. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నంద్యాల ఉప ఎన్నికల సమయంలో  పోలీసులు నోటిస్‌ ఇస్తేనే నాపై ఆరోపణలు చేశారు. ఎల్లోమీడియాలో చాలా కథనాలు రాశారు. అప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా?. బీసీకి మంత్రి పదవి ఇస్తే అసెంబ్లీలోనే నాపై విమర్శలు చేశారు. 
 
 

తాజా ఫోటోలు

Back to Top