ప్రపంచాన్నే ఏపీకి తెస్తారు..దటీజ్‌ జగనన్న

అతి తక్కువ కాలంలో నాలుగో స్థానంలో బెస్ట్‌ సీఎంగా వైయస్‌ జగన్‌  నిలిచారు

సీఎం వైయస్‌ జగన్‌ పాలనను చూసి ఓర్వలేక టీడీపీ ఏడుపు

మండలి రద్దుపై సీఎం వైయస్‌ జగన్‌దే తుది నిర్ణయం

తనపై ఒత్తిళ్లు ఉన్నాయని చైర్మన్ చెప్పకనే చెప్పారు

మండలిలో విజయం సాధించేశామని టీడీపీ భ్రమలో ఉంది

కృతజ్ఞత లేని వ్యక్తి అని యనమల గురించి ఎన్టీఆర్‌ విమర్శించారు

ప్రజాధనం దుర్వినియోగమని మండలిని ఎన్టీఆర్‌ రద్దు చేశారు

చంద్రబాబు కూడా 2004లో మండలిని రద్దు చేయమన్నారు

వైయస్‌ జగన్‌పై అవాకులు, చవాకులు పేల్చి టీడీపీ నేతలు అలసిపోయారు

ముస్లిం మైనారిటీల ఓట్లు దండుకోవడానికి నీచరాజకీయాలు చేస్తారా? 

ఎవరు సభకు తాగొస్తారో అందరికీ తెలుసు

నా బ్లడ్‌ శాంపిల్స్‌ ఇస్తా చేక్‌ చేసుకోండి..

మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌

తాడేపల్లి: అతి తక్కువ కాలంలో దేశంలోనే బెస్ట్‌ ఫెర్మామెన్స్‌ ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాలుగో స్థానంలో నిలిచారని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ తెలిపారు. చంద్రబాబుకు ఇది సాధ్యం కాదని, వైయస్‌ జగన్‌ వచ్చే ఏడాదికి దేశంలోనే బెస్ట్‌ సీఎంగా నంబర్‌ స్థానంలో ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. మీరు ఎన్ని దేశాలు తిరిగినా ఏం లాభం..వైయస్‌ జగన్‌ ఇక్కడే కూర్చొని ప్రపంచాన్ని ఏపీకి తీసుకువస్తున్నారు..దటీజ్‌ జగనన్న మండలిలో ఏదో సాధించామని టీడీపీ నేతలు సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి టీడీపీ నేతలు సహకరించకపోయినా ఫర్వలేదని, అడ్డుకోవద్దని సూచించారు.  తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రం ఎక్కడికీ పోవడం లేదు. టీడీపీ నేతలు అనవసరంగా ఆందోళన చెందుతున్నారు. మేం చెప్పినట్లే నడవాలి..ఈ రాష్ట్రంలో మేం చెప్పినట్లు నడవాలనే భ్రమల్లో చంద్రబాబు ఉంటున్నారు. ప్రజలు నిన్నటి ఎన్నికల్లో 23 సీట్లు ఇచ్చి చిత్తుచిత్తుగా ఒడించారు. అయినా వారికి సిగ్గు రాలేదు. మేం దావోస్‌కు వెళ్లాం. అభివృద్ధి చేశామంటున్నారు. వైయస్‌ జగన్‌ ఏమి చేయడం లేదని విమర్శిస్తున్నారు. చంద్రబాబు దావోస్‌ వెళ్లి ఏం చేశారు. రాష్ట్ర ఖజానాతో విదేశాల్లో తిరిగి కనీసం ఒక్క కంపెనీ అయినా రాష్ట్రానికి తీసుకొని వచ్చారా?. ఏమీ లేకుండా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, అధోగతిపాలు చేసి..ఈ రోజు రూల్స్‌ గురించి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రం వైయస్‌ జగన్‌ పరిపాలనలో సంక్షేమం కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. వైయస్‌ జగన్‌ ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. మీలాగా గొట్టం పేపర్లు కాదు..దేశంలోనే పేరుగాంచిన ఇండియా టూడే వైయస్‌ జగన్‌ గురించి ఏం చెప్పిందో చూడలేదా? గత నాలుగు సంవత్సరాలుగా తీసుకుంటే కూడా అతితక్కువ కాలంలో ఈ రోజు దేశంలోనే నాలుగో స్థానంలో బెస్ట్‌ ఫెర్మామింగ్‌ ముఖ్యమంత్రిగా నిలిచారు. మీ జీవితంలో ఇలాంటివి సాధించి ఉండరు. అవినీతిలో టాప్‌టెన్‌లో చంద్రబాబు ఉండేవారు. వైయస్‌ జగన్‌ బెస్ట్‌ సీఎంగా గుర్తింపు పొందిన తరువాత కూడా టీడీపీ నేతలకు బుద్ధి, జ్ఞానం రావడం లేదు. బాబు చెప్పిందే చేయాలని టీడీపీ వాళ్లు భ్రమల్లో బతుకుతున్నారు. ఈ రోజు మండలిలో సంఖ్యాబలం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సరిపోదు. చంద్రబాబు  ఆదేశాల మేరకు మండలి చైర్మన్‌ వ్యవహరించారు. ఆయనపై ఉన్న ఒత్తిడి మేరకే అలా చేశారు. ఏదో విజయం సాధించినట్లు పూల జల్లించుకోవడం, ఊరేగింపులు, పాలాభిషేకం అంటూ గొప్పలు చెప్పుకోవడానికి సిగ్గుండాలి. నోరు ఉందని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. యనమల రామకృష్ణుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్‌ రామారావును యనమల రామకృష్ణుడు వెన్నుపోటు పొడిచారు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌పై యనమల రామకృష్ణుడు కనీస విశ్వాసం కూడా చూపలేదు. ఈ యనమల చాలా శుద్ధులు చెబుతున్నారు. 
1983, మార్చి 24న ఎన్టీఆర్‌ మాట్లాడింది గుర్తు లేదా? ప్రతీ పైసాను దుబారా చేయడం సరికాదని, దీన్ని ఎంకరేజ్‌ చేయడం మంచిది కాదు..ప్రజల మద్దతు లేని ఏ సంస్థ అయినా, ఏ వ్యవస్థ అయినా దండగే అన్నారు. మండలిని రద్దు చేశారు. 2004లో దాన్ని తీసుకొచ్చేసమయంలో చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ..అసలు కౌన్సిలే అవసరం లేదు. ప్రజలపై భారం పడుతుంది. ఈ బిల్లును రద్దు చేయమని ఆ రోజు చంద్రబాబు మాట్లాడారు. ఈ రోజు వచ్చి ఆయన మా ఉద్యోగాలు పోతున్నాయని, ఉద్యోగ భద్రత పోతుందని గజినీదారుడు మాట్లాడుతున్నారు. యనమల రామకృష్ణుడు ఏదో పెద్ద మనిషి మాదిరిగా ఓ కోర్టు వేసుకొని నీతి వ్యాఖ్యాలు మాట్లాడుతుంటారు. చేసేవన్నీ కూడా వెదవ పనులు, మోసాలు, కుట్రలు. కృతజ్ఞత లేని వ్యక్తి అని యనమల గురించి ఎన్టీఆర్‌ విమర్శించారు.  వైయస్‌ జగన్‌ జైలుకు వెళ్తారని మాట్లాడుతున్నారు. పదేళ్ల పాటు ఇవే కదా మీరు చెప్పింది. కాంగ్రెస్‌, టీడీపీ కుట్ర పన్ని వైయస్‌ జగన్‌ను జైలులో పెట్టించారు. ఇదే సోది చెప్పి చెప్పి మీరు అలసిపోయారే తప్ప..ఈ రాష్ట్ర ప్రజలు క్లియర్‌ మెన్‌డెంట్‌ ఇచ్చారు. వైయస్‌ఆర్‌సీపీకి 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాలు ఇచ్చి అధికారం కట్టబెట్టారు. ఇంకా సిగ్గు లేదు. ఇంతకన్న ఇంకేం చెబుతున్నారు. ప్రజా తీర్పుకన్నా మరేమి లేదు. మా పాలనలో ఏదైన పొరపాటు చేస్తే ప్రజలు 2024లో మరోసారి తీర్పు ఇస్తారు. ఈ రోజు ప్రభుత్వంపై ఏదోవిధంగా అభాసుపాలు చేయాలని టీడీపీ కుట్రలు చేస్తున్నారు. మండలిలో లింగ్‌ లింగ్‌ మంటూ పాతిక మందిని పెట్టుకొని ఏదో సాధించామని సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు ఓ మేధావి అంటూ ఎల్లో మీడియాలో వార్తలు రాసుకుంటున్నారు. చంద్రబాబు వల్ల ఏమీ కాదు..వైయస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్రంలో వికేంద్రీకరణ జరుగుతుంది. రాష్ట్రమంతా అభివృద్ధి చెందుతుంది. ప్రజలు వైయస్‌ జగన్‌పై నమ్మకంతో ఉన్నారు. ఎల్లో మీడియాతో ఎన్ని డూప్‌ షాట్స్‌ కొట్టించుకున్నా ఏమీ కాదు. వచ్చే ఏడాదికి దేశంలోనే వైయస్ జగన్‌ బెస్ట్‌ ఫెర్మామెన్స్‌ ముఖ్యమంత్రిగా ఎదుగుతారు. చంద్రబాబు జన్మలో ఎలాగు అధికారంలోకి రాలేరు. కనీసం ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ దేశంలో మొదటి స్థానంలోకి వచ్చినందుకు సంతోషపడండి..తెలుగు వాడిగా గర్వపడండి. మీ బతుకలన్నీ ఇంతేనా..నవ్వడం రాదు..ఎప్పుడు ఏడుపులే. మీరు ఎన్ని దేశాలు తిరిగినా ఏం లాభం..ఇక్కడే కూర్చొని ప్రపంచాన్ని ఏపీకి తీసుకువస్తున్నారు..దటీజ్‌ జగనన్న. అబద్ధాలు చెప్పడం మాని..రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోకండి. మీకన్నా హార్స్‌ట్రేడర్స్‌ ఎవరైనా ఉంటారా?. మీ బతుకులు ప్రారంభమైంది ఎట్టా?. ఎన్టీఆర్‌ నుంచి పార్టీని లాక్కుంది వైశ్రాయ్‌ హోటల్‌లో హార్స్‌ట్రేడింగ్‌ కాదా? . మీ బతుకులే హార్స్‌ట్రేడింగ్‌..పెటెంట్‌ హక్కులు చంద్రబాబుకే ఉన్నాయి. ఆయనకు సేనాధిపతి యనమల రామకృష్ణుడు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మండలి చైర్మన్‌ను బూతులు తిట్టేశారని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సిగ్గుండాలి..ఇంకా మారరా? ఒక పెద్దాయన చేత నిండు సభలో రూల్స్‌ను అతిక్రమించి ఆయన చేత తప్పు చేయించారు. నన్ను ఎవరు తిట్టలేదని తణుకులో షరీఫ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. వీళ్ల మనుషుల చేత మైనారిటీలతో వైయస్‌ జగన్‌పై ముస్లిం వ్యతిరేకి అన్న ముద్ర వేయించాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చిన వాయిస్‌లు అందరూ విన్నారు. పెద్దాయన చేత అబద్ధాలు చెప్పించిన చంద్రబాబు సిగ్గుపడాలి. ఇంత దిగజారి, ఎన్ని చేసినా..ఏమీ చేసేది లేదు. నా బ్లేడ్‌ శాంపిల్స్‌ ఇస్తాం.. ఒపెన్‌ సవాల్‌ చేస్తున్నా..నాకు మందు అలవాటు ఉంటే నిరూపించండి. ఏది మాట్లాడినా చెల్లుతుందని మాట్లాడుతున్నారు. దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉంది టీడీపీ వ్యవహారం. మంత్రులపై ఇలాంటి అభాండాలు వేయడం పద్ధతేనా? అలాంటి ఆలోచన చేసే వారికే వస్తుంది. యనమల రామకృష్ణుడు ఎప్పుడు మత్తుగా ఉంటారు..ఆయనే మందు తాగి వచ్చి ఉంటారేమో? ఆయనే ఆలోచన చేయాలి. ఎవరు తాగి వస్తారో అందరికి తెలుసు. ఒక సభలో రూల్స్‌కు వ్యతిరేకంగా సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. మేం ఇలా చేయడం సరికాదని నేను, కొడాలి నాని చెప్పాం. నిజంగా దాడి చేయాలనే ఆలోచన ఉంటే ఎవరైనా మమ్మల్ని ఆపగలరా?. 
 

తాజా వీడియోలు

Back to Top