మా ప్రభుత్వం ప్రతిపక్షం మైక్ కట్ చేయదు

మంత్రి అనిల్ కుమార్
 
గతంలో బీఏసీ సమావేశంలో మాకు మాట్లాడే అవకాశం లేదు

 అచ్చెన్నాయుడు పశ్చాత్తాపం చెంది ఉంటారు

అమ‌రావ‌తి:  మా ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్షం మైక్ క‌ట్ చేయ‌ద‌ని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం సమస్యలపై చర్చలను పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. ఏపీ శాసనసభ కార్యకలాపాల సలహామండలి (బీఏసీ) సమావేశంలో అనిల్ కుమార్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, గతంలో బీఏసీ సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం లేదని అన్నారు. ఇప్పుడు బీఏసీ సమావేశం జరిగిన తీరు చూసి తామెంతో తప్పు చేశామని ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడు పశ్చాత్తాపపడి ఉంటారని వ్యాఖ్యానించారు.  

Back to Top