అనుకున్న సమయానికే పోలవరం పూర్తిచేస్తాం

ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్

పశ్చిమగోదావరి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ జీవ‌నాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టును అనుకున్న సమయానికే పూర్తిచేస్తామని, పునరావాస కాలనీలు కూడా పూర్తవుతున్నాయని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణం, పనుల పురోగతికి సంబంధించిన విషయాలను ఉన్నతాధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలన అనంతరం అధికారులతో సమీక్షా నిర్వహించారు. అనంతరం మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. వరదలు రాకముందే స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ వే పనులు పూర్తి చేసి అప్పర్, లోయర్‌ డ్యామ్‌లను పూర్తిచేస్తామన్నారు. కాఫర్‌ డ్యామ్‌ పనులు పూర్తయ్యాక డయాఫ్రమ్‌ వాల్‌కు మరమ్మతులు చేపడతామని చెప్పారు. 

 

తాజా వీడియోలు

Back to Top