రామోజీరావు వైట్‌ కాలర్‌ క్రిమినల్‌

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ డబ్బును వేర్వేరు కంపెనీలకు మళ్లించిన ఆర్థిక నేరగాడు

చిట్‌ఫండ్స్‌ యాక్ట్‌కు వ్యతిరేకంగా డబ్బును మళ్లించాడు

మార్గదర్శి ఫండ్స్‌తో రామోజీ ఫిల్మ్‌ సిటీ ఉద్యోగులకు జీతాలిస్తున్నాడు

చిట్టీ పాడుకున్నవారికి డబ్బులివ్వకుండా షూరిటీస్‌ నెపంతో కాలయాపన

ఆ డబ్బును సొంత కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం చట్ట వ్యతిరేకం

చిట్‌ఫండ్స్‌ కంపెనీ నడిపేవారు వేరే వ్యాపారం చేయకూడదని యాక్ట్‌ చెబుతోంది

పైసా పెట్టుబడి లేకుండా చిట్టీదారుల సొమ్ముతో రామోజీరావు వ్యాపారాలు 

అధికారులతో సోదాలతో రామోజీరావు మోసం బట్టబయలైంది

ఇది కక్షసాధింపు చర్య అనడం ధర్మం కాదు.. తప్పు చేశాడు కాబట్టే దొరికిపోయాడు

ఎప్పుడు ఏదైనా జరగవచ్చు.. చిట్టీదారులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది

ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు

తాడేపల్లి: ‘‘మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ డబ్బు తీసుకెళ్లి వేరే సంస్థల్లోకి మళ్లించడం, వేలాది కోట్ల రూపాయలు వేరొక అకౌంట్‌కు తరలించడం ఆర్థిక నేరం. రామోజీరావు వైట్‌కాలర్‌ క్రిమినల్‌. ఆర్థిక నేరగాడు కాబట్టే ఇంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఒక్క పైసా పెట్టుబడి లేకుండా అతిపెద్ద సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు’’ అని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చిట్‌ఫండ్స్‌ కంపెనీ నడిపేవారు వేరే వ్యాపారం చేయకూడదని చిట్‌ఫండ్‌ యాక్ట్‌లో ఉన్నప్పటికీ రామోజీరావు 14–15 వ్యాపారాలు చేస్తున్నాడని, ఫైనాన్స్‌ కంపెనీ డబ్బును ఆయా కంపెనీల్లో పెట్టుబడి పెట్టేందుకు తరలిస్తున్నాడన్నారు. అధికారుల సోదాలతో రామోజీరావు బండారం బట్టబయలైందన్నారు. ఇది కక్షసాధింపు చర్య అనడం ధర్మం కాదని, రామోజీరావు తప్పు చేశాడు కాబట్టే దొరికిపోయాడన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రకార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు ఏం మాట్లాడారంటే.. 
‘‘ఇప్పటంలో జరిగిన అతి చిన్న విషయం. ఎవరైతే ఆక్రమణలకు పాల్పడ్డారో.. ఆ ఆక్రమణలను చట్టబద్ధంగా తొలగించే కార్యక్రమం చేస్తే టీడీపీ, ఈనాడు రామోజీరావు, పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే స్థాయిలో పెద్ద విషయంగా గగ్గోలు పెట్టి, గందరగోళం చేశారు. అనుభవం లేని పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వాన్నే కూల్చేయాలనే స్థాయికి ఓవర్‌యాక్షన్‌ చేశారు. న్యాయస్థానాలకు వెళ్లారు.. స్టే తెచ్చుకున్నారు. ఆ తరువాత విచారణలో బండారం అంతా బయటపడింది. చట్ట ప్రకారమే ఆక్రమణలు కూల్చారు.. ఆక్రమణదారులు అధర్మంగా ప్రవర్తించారని, కోర్టును మభ్యపెట్టి, అఫిడవిట్‌లో తప్పులు రాసి స్టే తెచ్చుకున్నారు. ఇది కోర్టును మభ్యపెట్టడం అన్యాయం అని భావించి ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున 14 మందికి జరిమానా విధించారు. 

కుట్రలు, కుతంత్రాలు ఎక్కువకాలం నిలువలేవు. ఈనాడు రామోజీరావు, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కుట్రలు చేసి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలనే పద్ధతుల్లో వెళితే ఏ జరుగుతుందో ఈ చిన్న కథలో నీతి చాలా స్పష్టంగా అర్థం అవుతుందనే విషయాన్ని ప్రజల కంటే ముందు ఈ దుష్టచతుష్టయం తెలుసుకుంటే మంచిది. 

చిట్‌ఫండ్‌ కంపెనీ వ్యవహారం..
గత కొద్దిరోజులుగా అక్టోబర్, నవంబర్‌ నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా చిట్‌ఫండ్‌ కంపెనీల మీద సోదాలు జరుగుతున్నాయి. అధికారులు చిట్‌ఫండ్‌ కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ సోదాల్లో ఎవరైతే యాక్ట్‌ను అనుసరించకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో.. వారిని గుర్తించి, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారు. చట్టప్రకారం వారిని శిక్షించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది సహజంగా తరచూ ఫిర్యాదుల మీద జరిగే వ్యవహారం. 

మార్గదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీ కూడా చట్టానికి వ్యతిరేకంగా, లాను ఉల్లంఘించి అనేక అక్రమాలకు పాల్పడుతున్న విషయాలు బయటకువస్తున్నాయి. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారు ఎవరైనా.. వారిపై యాక్షన్‌ తీసుకోవాల్సిన బాధ్యత చట్ట ప్రకారం ఎన్నికైన ప్రభుత్వాలకు ప్రజాస్వామ్యంలో ఉంటాయి. మార్గదర్శి చిట్‌ఫండ్‌ రామోజీరావు కంపెనీ. మీడియా కింగ్‌గా పేరు తెచ్చుకున్న రామోజీకి అనేక సంస్థలు ఉన్నాయి.. ఆ సంస్థలన్నీ చట్ట వ్యతిరేకంగానే నిర్మించబడ్డాయని ఒక్కొక్కటిగా అర్థం అవుతుంది. 

మార్గదర్శి ఫైనాన్సర్స్‌ మీద వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫిర్యాదులు రావడం, దానిపై విచారణ జరగడం, కేసు పెట్టడం, ఆ కేసును వైయస్‌ఆర్‌ మరణించిన తరువాత, రాష్ట్రం విడిపోయిన తరువాత తిమ్మినిబొమ్మిని చేసి డిస్మిస్‌ చేయించుకోవడం, ఆ తరువాత మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ గమనించి సుప్రీం కోర్టుకు తీసుకెళ్లడం, సుప్రీం కోర్టులో ఈరోజు విచారణలో ఉన్న వైనాన్ని చూస్తున్నాం. 

రామోజీ చేసింది నేరం. ఆ నేరాన్ని హైకోర్టులో డిస్మిస్‌ చేసిన తరువాత రామోజీరావును ఏమీ చేయలేకపోయారు.. నేరం పోయిందనుకున్నారు. కానీ, సుప్రీం కోర్టులో ఫైల్‌ చేసి, స్టేట్‌ గవర్నమెంట్‌ కూడా ఇంప్లీడ్‌ అయిన తరువాత ఆ కేసు విచారణలోకి వచ్చింది. మార్గదర్శి ఫైనాన్స్‌ కూడా అనేక చట్టాలను ఉల్లంఘించి విచ్చలవిడిగా రామోజీరావు ప్రవర్తించారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌ అనేది మన రాష్ట్రంలోనే కాదు. చెన్నై, బెంగళూరులో అనేక శాఖలుగా ఏర్పడింది. చట్టబద్ధంగా వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చు.. తప్పులేదు. చట్ట వ్యతిరేకంగా వ్యాపారం చేయడం అన్యాయం. చట్ట వ్యతిరేకంగా చిట్‌ఫండ్‌ కంపెనీని నడుపుతున్న వ్యక్తి రామోజీరావు. దీనిలో వాస్తవం గురించి ప్రజలు, మేధావులు, చిట్‌ఫండ్‌ యాక్ట్స్‌ తెలిసినవారు ఆలోచన చేయాలి. 

రామోజీరావు సుమారుగా 50–60 సంవత్సరాల నుంచి చిట్స్‌ వ్యాపారం చేస్తున్నారు. మొన్న జరిగిన సోదాల్లో రామోజీరావు మోసం చేస్తున్నాడు, చట్టవ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు, చిట్‌ఫండ్‌ యాక్ట్‌ని దుర్వినియోగం చేస్తున్నాడని తేటతెల్లంగా అర్థమయ్యాయి. ఒక చిట్టీ వేస్తే.. ఆ చిట్టీల సభ్యుల నుంచి వసూలు చేసే సొమ్మును ప్రత్యేకంగా అకౌంట్‌ను ఓపెన్‌ చేసి.. ఈ మొత్తాన్ని జమ చేయాలి. ఒక చిట్‌ఫండ్‌ కంపెనీ ఒక చిట్టీ వేస్తే ఒక ఖాతా, రెండు వేస్తే రెండు ఖాతాలు ఓపెన్‌ చేయాలి. ప్రతీ చిట్టీకి ఒక ప్రత్యేక ఖాతాను ఓపెన్‌ చేయాలనేది చిట్‌ఫండ్‌ యాక్ట్‌ ఉద్దేశం, రూల్‌. 

కానీ, మార్గదర్శి చిట్‌ఫండ్‌ యాజమాన్యం అంతటికీ కలిపి ఒకే అకౌంట్‌ ఓపెన్‌ చేస్తారు. ఇది చట్ట వ్యతిరేకం. దీన్ని అధికారులు గుర్తించారు. 
ఎవరైనా చిట్‌ఫండ్‌ సభ్యులు ఉదాహరణకు కోటి రూపాయల చిట్టీ కడుతుంటే.. ఆర్థిక అవసరాలకు ఆ చిట్టీని పాడుకుంటే.. వారు ఇవ్వాల్సిన సొమ్ము రూ.60 లక్షలు ఇస్తే.. తరువాత సభ్యులు కడతారు. ఆ సొమ్ము ఎందుకు ఇవ్వడం లేదు. షూరిటీస్‌ సక్రమంగా అందించడం లేదు కాబట్టి సొమ్ము ఇవ్వడం లేదని ఈనాడు రామోజీరావు మార్గదర్శి కంపెనీ చెబుతుంది. ఇలా మూడు, నాలుగు, ఐదు నెలలు.. చివరకు షూరిటీస్‌ ప్రొడ్యూస్‌ చేయలేకపోవడం వల్ల డబ్బంతా వారి దగ్గరే పెట్టుకొని, వారికి ఒక రశీదు ఇచ్చి ఆ రశీదుకు వడ్డీ 4–5 శాతం ఇస్తున్నామని చెబుతున్నారు. ఇది నడిచే కథ. 

ఇలా చిట్టీ పాడుకున్నవారికి డబ్బులు పూర్తిగా ఇవ్వకుండా వారి దగ్గరే పెట్టుకోవడం వల్ల. ఉదాహరణకు 50 మంది చిట్టీలో సభ్యులు అయితే వారిలో 5–10 మందికి ప్రైజ్‌మనీ ఇస్తారు. మిగతా 40 మందికి ఇవ్వకుండా 3నెలలు హోల్డ్‌ చేస్తారు. ఒక్కొక్కరికీ రూ.60 లక్షలు అంటే.. మూడు నెలలు ఆలస్యం చేస్తారు. ఈ లెక్కన పెద్ద మొత్తంలో రిజర్వ్‌ ఫండ్స్‌ ఏర్పడుతున్నాయి. ఇది చక్రంలా తిరుగుతూ ఉండటం వల్ల వేల కోట్ల రూపాయలు ఒకేసారి కంపెనీ దగ్గర చేరడం, ఆ డబ్బును చట్ట ప్రకారం ఆ చిట్టీల ప్రత్యేక ఖాతాల్లోనే వేయాలి. కానీ, మార్గదర్శి కంపెనీ, వారికున్న ఈనాడు, వసుంధర పబ్లికేషన్, రామోజీ ఫౌండేషన్, ఈటీవీ, రామోజీ ఫిల్మ్‌ సిటీ, ఉషాకిరణ్‌ మూవీస్, కళాంజలి, ప్రియా ఫుడ్స్, డాల్ఫిన్‌ హోటల్స్, ప్రియా పచ్చళ్లు ఇలా అనేక రకాల సంస్థలు ఉన్నాయి. 

మార్గదర్శిలోని ఫండ్స్‌ను తీసుకెళ్లి ఆయా సంస్థల్లో పెట్టుబడులు పెడతారు. పైసా లేకుండానే చిట్టీదారుల సొమ్ముతో వ్యాపారాలు చేసే వ్యక్తి రామోజీరావు, మార్గదర్శి చిట్స్, మార్గదర్శి ఫైనాన్స్‌. ఇది చట్ట వ్యతిరేకమైనది. ఇలాంటి కార్యక్రమాలు 50–60 సంవత్సరాలుగా చేస్తున్నారు. వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్గదర్శి ఫైనాన్స్‌ చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుందని కేసులు పెట్టారు. మళ్లీ ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. చంద్రబాబు ఇవన్నీ ఏమీ పట్టించుకోరు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. పట్టించుకుంటే ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పి తప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 

రామోజీరావు పెట్టుబడి పెట్టిన ఆయా సంస్థలు నష్టపోతే.. మొత్తం చిట్టీదారులంతా నష్టపోతారనే విషయాన్ని చిట్టీలు కట్టేవారు గమనించాలి. చట్టబద్ధంగా, సక్రమంగా జరిగే సంస్థలు మినహా ఇలా ఎక్కడ జరిగినా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. దేశంలో ఎవ్వరైనా చట్టప్రకారం నడుచుకోవాలి. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించడం సరైన విధానం కాదు, దాన్ని చూస్తూ ప్రభుత్వాలు ఊరుకోవడం సరైన విధానం కాదు. రామోజీరావు అయినా మరొకరైనా ఎవ్వరైనా చట్టానికి అతీతులు కాదు. 

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ డబ్బు తీసుకొచ్చి వేరే సంస్థల్లో పెట్టుబడి పెట్టి.. వేలాది కోట్ల రూపాయలు వేరొక అకౌంట్‌కు తరలించడం ఆర్థిక నేరం. రామోజీరావు వైట్‌కాలర్‌ క్రిమినల్‌. ఆర్థిక నేరగాడు కాబట్టే ఇంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఒక్క పైసా లేకుండా, పెట్టుబడి లేకుండా ఏర్పాటు చేసిన సామ్రాజ్యం ఇది. 

2022 మార్చి 31 మార్గదర్శి బ్యాలెన్స్‌ షీట్‌ చూస్తే.. ఎంతటి మేధావికైనా ఆశ్చర్యం కలగకమానదు. కంపెనీ షేక్‌ క్యాపిటల్‌ రూ.2 కోట్లు మాత్రమే.. కంపెనీ రిజర్వ్‌ రూ.1,697 కోట్లు, కంపెనీ ఫిక్స్‌›్డ డిపాజిట్స్‌ రూ.768 కోట్లు, చెల్లించిన ప్రైజ్‌మనీ రూ.580 కోట్లు, మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టింది రూ.450 కోట్లు.. ఈ బ్యాలెన్స్‌ షీట్‌లో అర్థం అవుతుంది. ఫండ్స్‌ను డైవర్ట్‌ చేశామని ఆయనే ఒప్పుకుంటున్నాడు. డైవర్ట్‌ చేయడమే చట్ట వ్యతిరేకం. కానీ, బ్యాలెన్స్‌ షీట్‌లో ఎక్కడా ఎంత వచ్చింది.. ఎంతపోయింది.. ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పకుండా దాచేస్తున్నారు. అంతేకాకుండా అధికారులు సోదాలు చేస్తున్న సమయంలో సహకరించడం లేదు. ఏదైనా అడిగితే సమాధానం చెప్పకుండా ఫొటోలు, కెమెరాలతో బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. 

టీడీపీ అధికారంలోకి రావాలని, వైయస్‌ జగన్‌ అధికారం నుంచి దిగిపోవాలని చాలా కృషిచేసే వ్యక్తి రామోజీరావు. ఆ కక్షతోనే ఇదంతా చేస్తున్నామని ఆరోపణ చేయడం ధర్మం కాదు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తూనే ఉన్నారు కాబట్టే దొరికిపోయారు. 

మార్గదర్శి ఫైనాన్స్‌కు సంబంధించిన అంశంలో నేను ఇక అక్రమంగా డిపాజిట్లు తీసుకోను అని హైకోర్టులో అఫిడవిట్‌ ఫైల్‌ చేశారు. కానీ, ఇప్పటికీ అక్రమంగా డిపాజిట్లు తీసుకుంటున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఎవరైతే చిట్టీ పాడుకొని షూరిటీస్‌ ప్రొడ్యూస్‌ చేయలేకపోతున్నామనేవారికి రశీదు ఇచ్చి పెట్టుబడులు తరలిస్తున్నారు. 

మరో కీల‌క‌మైన‌ అంశం ఏంటంటే.. చిట్టీ పాడుకున్న తరువాత షూరిటీస్‌ ప్రొడ్యూస్‌ చేయలేదు కాబట్టే వారు ఇవ్వలేదు అనుకుంటే పొరపాటే.. షూరిటీగా ఎవరిని తీసుకెళ్లినా పనికిరారు అని తాత్సారం చేస్తారు. మంచివారిని తీసుకెళ్తే వెరిఫికేషన్‌ అని మూడు, నాలుగు సార్లు తిప్పుతారు. ఆ తరువాత వేలాది మంది రూ.60 లక్షల సొమ్ము వారికున్న కంపెనీల్లో పెట్టుబడులుగా పెడతారు. రామోజీ ఫిల్మ్‌ సిటీ జీతాలు కూడా ఈ సొమ్ము నుంచే ఇచ్చారని బ్యాలెన్స్‌ షీట్‌లో కనిపించింది. చిట్‌ఫండ్‌ కంపెనీ డబ్బును డైవర్ట్‌ చేయడానికి వీల్లేదు. అయినా తీసుకెళ్లి వారి సొంత కంపెనీలో జీతాలు ఇచ్చారు. 

చిట్‌ఫండ్‌ నిర్వహించే కంపెనీలు, వేరే కంపెనీలు చేయకూడదని చిట్‌ఫండ్‌ యాక్ట్‌లో ఉంది. మార్గదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీ వేరే వ్యాపారాలు చేయకూడదు. కానీ రామోజీరావు 14–15 వ్యాపారాలు చేస్తున్నాడు. ఇది కూడా చట్ట వ్యతిరేకమే. అనేక అక్రమాలకు పాల్పడుతున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను ప్రజలు గమనించాలి. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు.. కంపెనీ మూతపడొచ్చు.. నష్టపోయేది చిట్టీ కట్టేవారే. రేపు గగ్గోలు పెడతారు. కాబట్టి చిట్టీదారులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది’ అని మంత్రి అంబటి సూచించారు.
 

తాజా వీడియోలు

Back to Top