జండాలు జతకట్టడమే మీ ఎజెండా!

మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్‌

ప‌ల్నాడు: ఉమ్మడిగా ఉన్నామనే సంకేతాలు పంపేందుకు జెండా పేరుతో తాడేపల్లి గూడెంలో టీడీపీ-జ‌న‌సేన పార్టీలు సభను నిర్వహిస్తున్నాయి. అయితే ఈ సభ వేదికగానే.. తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు ఇరు పార్టీల కేడర్‌లు. అదే సమయంలో జనాలు సైతం ఈ సభను పెద్దగా పట్టించుకున్నట్లు లేదు.  టీడీపీ-జనసేన ఉమ్మడి సభ జనం లేక వెలవెలబోతోంది. జెండా స‌భ‌పై మంత్రి అంబ‌టి రాంబాబు స్పందించారు. జెండాలు జ‌త‌క‌ట్ట‌డ‌మే మీ ఎజెండా..ఉన్నోళ్లు పారిపోడమే వాళ్ళ ఎజెండా  ! అంటూ మంత్రి అంబ‌టి రాంబాబు త‌న ఎక్స్‌(ట్విట్ట‌ర్‌)ఖాతాలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

Back to Top