రాజ్యసభలో కుర్చీ మడతేసిన టీడీపీ

మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్‌

ప‌ల్నాడు:  రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ సాధించ‌డం ప‌ట్ల మంత్రి అంబ‌టి రాంబాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. రాజ్య‌స‌భ‌లో టీడీపీ కుర్చీ మ‌డ‌తేసింద‌ని, అతి త్వరలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ! కుర్చీ మ‌డ‌తేస్తుంద‌ని మంత్రి అంబ‌టి రాంబాబు త‌న ఎక్స్‌(ట్విట్ట‌ర్‌)ఖాతాలో పోస్టు చేశారు.

కాగా, రాజ్యసభ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి, మేడా మల్లిఖార్జునరెడ్డి, గొల్ల బాబూరావు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ మూడు స్థానాలకు దక్కించుకోవడంతో రాజ్యసభలో వైయ‌స్ఆర్‌సీపీ బలం 11కు చేరుకుంది.

Back to Top