‘కోడెల ఆత్మహత్య చేసుకోవడానికి కారణం చంద్రబాబే’

మంత్రి అంబ‌టి రాంబాబు
 

సత్తెనపల్లి:  ​కోడెల ఆత్మహత్యకు కారణం చంద్రబాబే అంటూ మంత్రి అంబ‌టి రాంబాబు ఆరోపించారు . కోడెల కుటుంబాన్ని చంద్రబాబు వేధించారు. చంద్రబాబు కుట్రలకు కోడెల భయపడ్డారు. కోడెల చనిపోయినా ఆ కుటుంబంపై చంద్రబాబుకు కక్ష పోలేద‌న్నారు.కోడెల కుటుంబానికి టికెట్‌ ఎందుకు ఇవ్వలేద‌ని మంత్రి  ప్రశ్నించారు.  ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడు నాలుక జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలని  హెచ్చరించారు. తనను ఆంబోతు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  ‘నన్ను ఆంబోతు అంటున్నావ్‌.. నీ చరిత్ర ఏంటో తెలుసుకో చంద్రబాబు. ఆంబోతులకు ఆవులను సప్లయి చేసిన చరిత్ర నీది. 
చంద్రబాబు మాట్లాడేటప్పుడు నాలుక జాగ్రత్త. చంద్రబాబు ఒక చీటర్‌. చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నాడు. చంద్రబాబు చెత్త పాలన చేశారు కాబట్టే చిత్తుచిత్తుగా ఓడిపోయారు. చంద్రబాబు ఓ మోసగాడు, ఓ 420 అంటూ దుయ్య‌బ‌ట్టారు.

 రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో ఏం మాట్లాడారంటే:

మునిగిపోయే నావను కాపాడుకోవాలనే చంద్రబాబు తాపత్రయం:
– నిన్న చంద్రబాబు పల్నాడులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన తీరు, శాసనసభ్యులు, జగన్‌ గారిపై ఆక్రోశాన్ని వెల్లగక్కారు. 
– కల్లబొల్లి ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించాలని ప్రయత్నం చేశారు. 
– తన 14 ఏళ్లు పరిపాలనలో పల్నాడుకు ఏం చేశాడో చెప్పే ప్రయత్నం మాత్రం ఆయన చేయలేదు. 
– పల్నాడు అభివృద్ధి గురించి మాట్లాడుతూ వరికపూడిశెల పూర్తిచేస్తాడట. మంచినీటి స్కీం తీసుకొస్తాను అన్నాడు. 
– చంద్రబాబూ..వరికపూడిశెలకు నువ్వు అనేక సార్లు శంకుస్థాపన చేశావు కదా..? నీ 14 ఏళ్లలో ఈ పథకం నీకు గుర్తుకు రాలేదా? 
– పల్నాడు డ్రాట్‌ మిటిగేషన్‌ స్కీం కూడా చంద్రబాబుకు ఇంతకు ముందు గుర్తుకు రాలేదు. 
– దీనికి తోడు చంద్రబాబు నరసరావుపేట పార్లమెంటులో ఉన్న 7 మంది శాసనసభ్యుల జాతకాలు రాస్తున్నాడట. 
– ఈయన చిత్రగుప్తుని చిట్టా రాస్తాడు..వాళ్ల అబ్బాయి ఎర్ర బుక్కు రాస్తాడట. ఈ పుస్తకాలు రాసి ఏం చేసుకుంటారయ్యా? 
– నిన్నటి చంద్రబాబు ఉపన్యాసం చూస్తే వారిది మునిగిపోతున్న పడవ అనేది అర్ధం అవుతుంది. 
– దాన్ని ఎలా కాపాడుకోవాలనే తాపత్రయం తప్ప తిరిగి అధికారంలోకి వచ్చే లక్షణాలున్న రాజకీయ పక్షంగా కనిపించడం లేదు. 
– ఈ రాష్ట్రంలో 14 ఏళ్లు నువ్వేం చేశావ్‌..? 
– లేని పోని అభూతకల్పనలు సృష్టించుకుని ఇక్కడున్న వారంతా దుర్మార్గులు అంటాడు. 
– పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మారీచుడు అంటున్నాడు. మార్చమంటున్నాడు. 
– మార్చేది లేదు..నీకు దమ్ముంటే పిన్నెల్లిని ఓడించు. అతన్ని చూస్తేనే భయపడుతున్నావు. 
– కాసు మహేష్‌ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. వారి కుటుంబం ఈ రాష్ట్రంలో అనేకమైన పదవులు నిర్వహించి మేలు చేసిన వ్యక్తులు. 
– మా వాళ్లపై ఓడిపోయిన వారి గురించి ఎందుకు చెప్పడం లేదు చంద్రబాబూ..? 
– మీ పరిపాలనలో ఈ 7 నియోజకవర్గాల్లో ఓడిపోయిన మీ వాళ్ల గురించి చెప్పవేం..? 
– ఒక్క సారి మీరు ఎంత దుర్మార్గమైన పరిపాలన చేశారో గుర్తు చేసుకోండి. 
– అందుకే ఆ 7 నియోజకవర్గాల్లో మీ టీడీపీ అభ్యర్థులను ప్రజలు ఓడించిన పల్నాడు చరిత్ర సృష్టించింది. 

ఏ ఆంబోతుకు ఏ ఆవును సప్లై చేశావో చిట్టా విప్పుతా..తస్మాత్‌ జాగ్రత్త.:
– నా గురించి కూడా మాట్లాడాడు. ఆంబోతు రాంబాబు అంటున్నాడు. 
– నన్ను ఆంబోతు అన్నప్పుడల్లా నేను అంటూనే ఉంటా. నన్ను ఆంబోతు అంటున్నావ్‌..నిన్ను ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగిన వ్యక్తి నారా చంద్రబాబునాయుడు. 
– ఏ ఆంబోతుకు ఏ ఆవును సప్లై చేశావో కూడా చిట్టా విప్పుతా..తస్మాత్‌ జాగ్రత్త. 
– నా గురించి మాట్లాడేటప్పుడు నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడు. 
– నువ్వు ఒక మోసగాడివి...420. రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావ్‌..ఎన్టీఆర్‌ను మోసం చేశావ్‌. 
– టీడీపీని మోసం చేశావ్‌..నీ బంధువులను కూడా మోసం చేసిన 420 వ్యక్తివి నువ్వు. 
– ఈ రాష్ట్రంలో నీకు నూకలు చెల్లాయ్‌...నీకూ, నీ పార్టీకి భవిష్యత్తు లేదు. 
– నన్ను రంకెలేస్తున్నాను అంటూ నిన్న నువ్వు ఎన్ని రంకెలేశావో గమనించుకో. 

కోడెలను వేధించి..ఆయన మరణానికి కారణమైంది చంద్రబాబే:
– కోడెల శివప్రసాద్‌రావు నాపై పోటీ చేసి ఓ సారి గెలిచాడు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయాడు. 
– కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్య చేసుకోడానికి ఎవరు కారణం..? 
– ఆయన మరణానికి ప్రధాన కారణం నారా చంద్రబాబునాయుడు. 
– కోడెల శివప్రసాద్‌ చనిపోకముందు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. 
– ఆయన ఓటమి పాలైన తర్వాత కనీసం నిన్ను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు. 
– ఆయన్ను, ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టాలని నువ్వు నిర్ణయించుకున్నది వాస్తవం కాదా? 
– అందుకే ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యయత్నం చేసుకున్నారు. 
– ఆయన్ను పలకరిద్దాం..అని పత్తిపాటి పుల్లారావు అడిగితే ఆ దుర్మార్గుడ్ని పలకరించవద్దు అన్నది చంద్రబాబే. 
– ఆ మాటకు ఆయన మరింత కుంగిపోయి మృతి చెందాడు. 
– శతృవులకు కూడా భయపడని కోడెల నీకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. 
– దాన్ని కూడా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గం చంద్రబాబు. 
– దాన్ని సొమ్ము చేసుకునేందకు కోడెల మరణానికి వైఎస్సార్సీపీ కారణం అంటున్నాడు. 
– అదే నిజమైతే ఆయన కుటుంబానికి సింపతీ వస్తుంది కదా..వాళ్లకి ఎందుకు టికెట్‌ ఇవ్వలేదు..? 
– ఆయనపై, ఆయన కుటుంబంపై నీకు ఇంకా కక్ష పోలేదు కాబట్టి పక్కన పెట్టావు. 
– వారి కుటుంబంలో ఎవరికీ రాజకీయ భవిష్యత్తు లేకుండా అణచివేస్తున్న దుర్మార్గుడు చంద్రబాబు. 

నువ్వు తులసి మొక్కవో..గంజాయి మొక్కవో ప్రజలందరికీ తెలుసు:
– శ్రీకృష్ణదేవరాయలు గంజాయి వనం నుంచి తులసి వనంలోకి వచ్చాడట. 
– నువ్వొక తులసి మొక్క..నీ టీడీపీ తులసి వనం అంటే అశ్చర్యం వేస్తుంది. 
– లావు శ్రీకృష్ణదేవరాయల కుటుంబం పార్లమెంటుకు వెళ్లాలని ఎప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నారు. 
– వాళ్ల నాన్న కూడా లక్ష్మీపార్వతి టీడీపీ నుంచి ప్రయత్నం చేశారు. నీ టీడీపీ నుంచి కూడా ప్రయత్నం చేసి ఉండొచ్చు. 
– అలాంటి యువకుడైన లావు శ్రీకృష్ణదేవరాయలను పల్నాడులో గెలిపించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డి గారికి దక్కుతుంది. 
– అలా గెలిచి నేడు ఆయన తెలుగుదేశంలోకి వెళ్లాడు. అది ఆయన ఇష్టం. 
– దానికి కారణం..ఇక్కడి ఏడు నియోజకవర్గాలు ఓసీలకు ఇస్తే..పార్లమెంటు బీసీలకు ఇద్దామని జగన్‌మోహన్‌రెడ్డి గారు భావించారు. 
– బీసీలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఆయన్ను గుంటూరులో పోటీ చేయమని చెప్తే కుదరదన్నాడు. 
– ఇక బీసీల ఓటు అడిగే హక్కు విశ్వాస ఘాతకుడైన శ్రీకృష్ణదేవరాయలకు లేదు. 
– ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైఎస్సార్సీపీ పెట్టినప్పుడు జగన్‌ గారి వెంట నడిచాడు.
– అందుకే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. వాళ్ల కుమారుడికి జడ్పీటీసీ ఇచ్చారు. విప్‌ ఇచ్చి క్యాబినెట్‌ ర్యాంకు ఇచ్చి గౌరవించారు. 
– అలాంటి జంగా కృష్ణమూర్తి మనసును విషపూరితం చేసి సీటిస్తారని చెప్పి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశావు. 
– నీ మాట నమ్మి జంగా కృష్ణమూర్తి నిలువునా మునిగిపోయే పరిస్థితి తీసుకొచ్చావు. 
– జగన్‌ గారు నేరుగా చెప్తారు తప్ప...ఇలాంటి రాజకీయాలు చేయరు. 
– అలాంటి లావు శ్రీకృష్ణదేవరాయలు తులసి మొక్క అట..మేం గంజాయి మొక్కలమట. 
– లావు, కన్నాలంతా చాలా గొప్పవారట. ఒక్క సారి కన్నా చరిత్ర తిరగేస్తే చంద్రబాబును ఎలా తిట్టాడో తెలుస్తుంది. 
– మీకు అధికారం ఉంటే చాలు తప్ప నీకు ఏ సిగ్గూ శరం లేనే లేదు. 
– టీడీపీ కార్యకర్తలకు మనవి చేస్తున్నా. లావు, కన్నాలు టీడీపీ ప్రొడక్టులు కాదు. 
– వాళ్లంతా కాంగ్రెస్‌ వారు. లావు అయితే పచ్చిగా జగన్‌ గారి ప్రొడక్ట్‌. 
– వీళ్లు మీ దగ్గర ఉండేవాళ్లు కాదు. ఛాన్స్‌ వస్తే మళ్లీ గోడదూకేవారే. 
– మునిగిపోతున్న పడవను పైకి లేపాలని చంద్రబాబు చేసే ప్రయత్నాలను ప్రజలను అర్ధం చేసుకోవాలి. 

యూజ్‌ అండ్‌ త్రోకి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబే:
– జగన్‌ గారు యూజ్‌ అండ్‌ త్రో అంటున్నాడు. ఈ రాష్ట్రంలో యూజ్‌ అండ్‌ త్రో అంటే గుర్తొచ్చేది నారా చంద్రబాబే. 
– చివరికి ఎన్టీఆర్‌ కుటుంబాన్ని కూడా యూజ్‌ అండ్‌ త్రోగా వాడుకున్నావు. 
– నీ తమ్ముడిని, హరికృష్ణ, నీ తొడళ్లుడిని వాడుకుని వదిలేసి యూజ్‌ అండ్‌ త్రో పాలసీ తెలిసిన వ్యక్తి చ్రందబాబే. 
– హూ కిల్డ్‌ బాబాయి కాదు..హు కిల్డ్‌ కోడెల..చెప్పు సమాధానం. 
– హూ కిల్డ్‌ వంగవీటి రంగా..? రంగా మరణానికి నువ్వే కారణం. 
– ఈ రాష్ట్రంలో అనేక విధ్వంసాలు, హత్యలకు నీ అధికార దాహమే కారణం. 
– రాజశేఖరరెడ్డి గారు వచ్చినప్పుడే నువ్వు మరుగున పడిపోయావ్‌. దురదృష్ట వశాత్తు ఓ ఐదేళ్లు పొరపాటున అధికారంలోకి వచ్చావు అంతే. 
– ఇక జగన్‌ గారు వచ్చిన తర్వాత నేరుగా రాజకీయాలు చేస్తున్నారు. నీలా మానిప్యులేటర్‌ కాదు. 
– ఆయన పరిపాలన ప్రారంభం అయిన తర్వాత తెలుగుదేశం భూస్థాపితం అయిపోయింది. 
– ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు నువ్వు ఎంత గొంతు చించుకున్నా ఫలితం లేదు. 
– రాష్ట్ర ప్రజలు వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చుకునేందుకు తాపత్రయపడుతున్నారో మా సిద్ధం సభలు చూస్తే అర్ధం అవుతుంది. 
– ఈ విషయం చంద్రబాబుకూ అర్ధం అయింది. మేం వదిలేసినోళ్లు, మా వద్ద నుంచి మోసం చేసి పోయినోళ్లు నీకు దిక్కయ్యారు తప్ప నీకు అభ్యర్థులే లేరు. 
– ఈ రాష్ట్రంలో తిరిగి మీరు అధికారంలో రావడం జరగని పని.
– వైఎస్సార్సీపీ గూండాలను పల్నాడులో ఎలా కాపురాలు చేస్తారో చూస్తా అంటూ మాట్లాడుతున్నాడు. 
– నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు..నీకు, పవన్‌కు పిచ్చెక్కి మాట్లాడుతున్నారు తప్ప..మీ టైం అయిపోయింది. 

సచివాలయం తాకట్టు అనేది పచ్చ మీడియా పచ్చి అబద్ధం:
– తాకట్టులో సచివాలయం అంటూ పచ్చ మీడియా పచ్చి అబద్ధాలు రాసి ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. 
– వాళ్లు రాయడం..చంద్రబాబు అండ్‌ కో దాని గురించి మాట్లాడటం రివాజుగా మారింది. 
– సెక్రటేరియట్‌ను తాకట్టు పెట్టడం పూర్తి అవాస్తవం. ఏదో ఒక విధంగా జగన్‌ గారిపై బురదజల్లే ప్రయత్నమే ఇది. 
– రాధాకృష్ణ, రామోజీలు అసలు పత్రికా విలువలే మర్చిపోయారు. 
– అసత్యాలు రాసి ప్రజల్ని నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు. 
– మీకున్న రెండు పత్రికలు, మూడు టీవీలు..జగన్‌ గారిపై అబద్ధాలు రాయడం, చంద్రబాబు వీరుడు సూరుడు అని పైకి లేపడం చేస్తున్నారు. 
– మీ బండారం ప్రజలకు అర్ధం అయింది. దీన్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. 
– పచ్చి అవాస్తవాలను రాసి సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. 
– చంద్రబాబు మాకు వార్నింగ్‌లు ఇవ్వడం ఊసుబోని సొల్లు కబుర్లుగా భావిస్తాం. 
– పల్నాడులో శాంతిభద్రతలు చంద్రబాబు కాలంలో కంటే చాలా బేషుగ్గా ఉన్నాయి. 
– ఎవరితోనైనా శాంతిభద్రతలపై చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. 
– పల్నాడులో 7కి 7 అసెంబ్లీల్లో గెలుస్తాం..మెజార్టీలు కూడా పెంచి చూపిస్తాం. 

లోకేశ్‌ ఎక్కడా..? బయటకు వస్తే గోవిందా అనుకున్నారా?:
– అసలు లోకేశ్‌ కనిపించడం లేదేంటి? పాదయాత్ర చేశాడు..గొప్పోడు అన్నారు కదా? 
– ఇప్పుడెందుకు బయటకు తీసుకురావడం లేదు. వస్తే గోవిందా అనుకున్నారా? 
– మేనిఫెస్టోని 99శాతం పూర్తి చేసి ప్రజల్ని ఓట్లడుగుతున్న నాయకుడు ఈ దేశంలో ఒక్క జగన్‌ గారే. 
– చంద్రబాబు మేనిఫెస్టోని బుట్టదాఖలు చేసే వ్యక్తి. బాబు, పవన్‌ల కాలం చెల్లింది. 
– నాలుగో సిద్ధం సభ తర్వాత టీడీపీ పోటీ నుంచి పారిపోయే పరిస్థితి వస్తుంది. 

Back to Top