2024లోనూ బాబుకు బాదుడే బాదుడు

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు 

ప్రజలు మిమ్మల్ని ఏకంగా ‘బాదుడే బాదుడు’

2019 ఎన్నికల్లో 151 సీట్లలో మిమ్మల్ని బాదేశారు

నీ కుమారుణ్ని దొడ్డిదారిన మంత్రిని చేశావు

ఆయనను కూడా మంగళగిరిలో బాదేశారు

ఆ తర్వాత అన్ని ఎన్నికల్లోనూ మీకు ఓటమిలే

కుప్పం మున్సిపాలిటీలోనూ మీ పార్టీ ఓటమి

కుప్పంలో నాలుగు మండలాల్లోనూ ఘోర పరాజయం

అన్ని స్థానిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు

ఇవన్నీ అసలైన ‘బాదుడే బాదుడు’

ఇకనైనా వాస్తవాలు గుర్తించండి చంద్రబాబూ...

మంత్రి అంబటి రాంబాబు స్పష్టీకరణ

నాడు 2004లోనూ మీకు బాదుడే బాదుడు

ఆ తర్వాత 2009లో కూడా బాదుడే బాదుడు

2014లో మీకు అధికారం ఇస్తే ఏం చేశారండి?

జన్మభూమి కమిటీలతో ప్రజలను బాదుడే బాదుడు

అందుకే మీకు 2019 ఎన్నికల్లో బాదుడే బాదుడు

వైయస్సార్‌గారి కుమారుడి చేతిలో చిత్తుగా ఓడారు

50 శాతానికి పైగా ఓట్లు, 22 మంది ఎంపీలు

మొత్తం 87 శాతం గెల్చుకుని మిమ్మల్ని బాదాం

అదీ నిజమైన బాదుడే బాదుడు

ప్రెస్‌మీట్‌లో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

  తాడేపల్లి: 2024లోనూ చంద్ర‌బాబుకు బాదుడే బాదుడని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో బుధ‌వారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

 అంబటి రాంబాబు ఏం మాట్లాడారంటే..:

తోక ముడిచారు:
    తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే, ప్రతిపక్ష పాత్ర కూడా నిర్వహించకుండా, శాసనసభకు రావడం లేదు. గతంలో జగన్‌గారు సభను బహిష్కరిస్తే, అది ప్రజాస్వామ్య విరుద్ధం అని, సభ నుంచి పారిపోయారని, సభకు రాకుండా జీతాలు తీసుకోవడం ఏమిటని, అసలు రాజీనామా చేసి వెళ్లొచ్చు కదా అని ప్రగల్భాలు పలికిన, దూషించిన చంద్రబాబు, ఇవాళ తోక ముడిచి, ఒక సిల్లీ ప్రతిజ్ఞ చేసి సభకు రాకుండా పారిపోయి, రాష్ట్రమంతా తిరిగే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇవాళ హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళం వెళ్లారు. 

అర్ధం లేని సాకు:
    అలా చంద్రబాబు ఎందుకు తిరుగుతున్నారు అంటే, జగన్‌గారు వచ్చినప్పటి నుంచి ధరలు పెరిగాయట. ప్రజలు సంతోషంగా లేరట. ప్రజలు ప్రశ్నిస్తున్నారట. కానీ అవేవీ మాకు కనిపించడం లేదు. నిజానికి అప్పటి కంటే కందిపప్పు వంటి వాటి ధరలు ఇప్పుడే చౌకగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇటీవల కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా. ఆ తర్వాత ఇప్పుడు ఉక్రెయిన్‌పై యుద్ధం. వాటి వల్ల కొన్నింటి ధరలు పెరిగాయి.
    అయితే ఒక విష ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో, తనకు ఉన్న పత్రికలు, టీవీలు, ఎల్లో మీడియాలో కధనాలు మొదలు పెట్టారు. 
జగన్‌గారి పాలనలో అన్ని ధరలు పెరిగాయని, ప్రజలు తినలేక పోతున్నారు. అశాంతిగా ఉన్నారు.. అని రాయడం. ఆ వెంటనే చంద్రబాబు తిరగడం మొదలు పెట్టారు. దానికి బాదుడే బాదుడు అని పేరు పెట్టారు.

కానీ ఇదీ అసలైన ‘బాదుడే బాదుడు’:
    చంద్రబాబుగారు మీ అయిదేళ్ల పాలనలో ఏం చేశారు? అంతా బాదుడే బాదుడు. అందుకే ప్రజలు 2019 సాధారణ ఎన్నికల్లో మీకు కేవలం 23 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. 151 సీట్లలో బాదేశారు. అంతేకాదు నీ కుమారుణ్ని దొడ్డిదారిన తీసుకొచ్చి, మంత్రిని చేసినా, ఆయనను కూడా మంగళగిరిలో బాదేశారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన మీరు, కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకుంటున్న మిమ్మల్ని.. అదే ప్రజలు ఏకంగా 15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిని చేశారు. అది అసలైన బాదుడే బాదుడు.
    నాడు 2004లో వైయస్సార్‌గారి చేతిలో బాదుడే బాదుడు. ఆ తర్వాత 2009లో కూడా బాదుడే బాదుడు. 2014లో మీకు అధికారం ఇస్తే, ఏం చేశారండి? ప్రజలను బాదుడే బాదుడు. జన్మభూమి కమిటీలతో ప్రజలను బాదారు. అందుకే ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైయస్సార్‌ గారి కుమారుడి చేతిలో మీకు బాదుడే బాదుడు. 50 శాతానికి పైగా ఓట్లు, 22 మంది ఎంపీలతో 87 శాతం గెల్చుకుని మిమ్మల్ని బాదాం. అది నిజమైన బాదుడు.

ఆ తర్వాతా మీకు ‘బాదుడే బాదుడు’:
    ఆ తర్వాత కూడా మీకు ఆ బాదుడు ఆగలేదు. పంచాయతీ ఎన్నికల్లో.. 13,081 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే, అవి పార్టీ గుర్తులతో జరగకపోయినా.. ఎవరు ఏ పార్టీ అన్నది అందరికీ తెలుసు. 13,081 పంచాయతీల్లో వైయస్సార్‌సీపీ ఏకంగా 10,536 పంచాయతీలను గెల్చుకుంది. ఆ విధంగా 81 శాతం గెల్చుకుంటే, అది నిజమైన బాదుడే బాదుడు. గుర్తు పెట్టుకోండి. జడ్పీటీసీలు మొత్తం 638 ఉంటే, వాటిలో 628 వైయస్సార్‌సీపీ గెల్చుకుంది. అంటే 98 శాతం విజయం. అది నిజమైన బాదుడు. తుక్కుగా ఓడించాం. ఎంపీటీలు మొత్తం 9583 ఉంటే, వాటిలో 8249 వైయస్సార్‌సీపీ గెల్చుకుంది. మరి దీన్ని ఏమంటారు?
75 నగర పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే, ఒక్కటి మాత్రమే గెల్చారు. అంటే చావు తప్పి కన్ను లొట్ట పోయింది. అది అసలైన బాదుడే బాదుడు.

కుప్పంలోనూ మీకు ‘బాదుడే బాదుడు’:
    ఇక మీ కుప్పం నియోజకవర్గం. నాలుగు మండలాలు, ఒక మున్సిపాలిటీ. కానీ ఒక్కటీ గెలవలేదు. అన్ని చోట్లా వైయస్సార్‌సీపీని గెలిపించి మిమ్మల్ని బాదుడే బాదుడు. గత ఎన్నికల్లో మీ దత్తపుత్రుడు. రెండు చోట్ల పోటీ చేశాడు. మీరు ఆ చోట్ల బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టినా, ప్రజలు బాదుడే బాదుడు.
    ఇంక ముందుంది ముసళ్ల పండగ. రాబోయే ఎన్నికల్లో 2024లో కూడా నీవు, నీ దత్తపుత్రుడు కలిసి 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే, అప్పుడూ ఉంటుంది బాదుడే బాదుడు.

ప్రజలు నమ్మబోరు:
    ఇవాళ జగన్‌గారు ధరలు పెంచకపోయినా పెంచారని, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌ ధరలను కేంద్రం పెంచితే, అది మేమే పెంచామని రామోజీగారు రాయడం, రాధాకృష్ణ వెటకారం చేయడం, మీరు బాదుడే బాదుడు అంటూ తిరగడం. ఇవాళ జగన్‌గారి పరిపాలన చూశాక, చంద్రబాబుగారికి గుర్తుకు రావాల్సింది, వారికి జరిగిన బాదుడే బాదుడు. కాబట్టి మీరు ఎంత గొంతు చించుకున్నా ప్రజలు నమ్మరు.

ఇది వాస్తవం:
    రూ.1.36 లక్షల కోట్లు, ఎక్కడా ఒక్క రూపాయి  దుర్వినియోగం లేకుండా, అవినీతికి తావు లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేసిన జగన్‌గారు బాదాడంటే ఎవరూ నమ్మరు. కానీ మిమ్మల్ని, మీ కుమారుడిని, మీ దత్తపుత్రుడిని బాదాడంటేనూ, తెలుగుదేశం పార్టీని పతనావస్థకు తీసుకుపోయారంటేనూ ప్రజలు నమ్ముతారు. అంతే తప్ప, ఇలాంటి కల్లబొల్లి మాటలు చెబితే నమ్మరు. చంద్రబాబునాయుడు బాదుడే బాదుడే అంటే వారికి ఇవన్నీ గుర్తుకు వస్తాయి కానీ, జగన్‌గారు గుర్తుకు రారు అని మనవి చేస్తున్నాను.

 వారికి మళ్లీ ఓటమి తప్పదు:

    ప్రజల్లో తిరుగుబాటు మొదలైందంటే, వీరు ఉసి కొల్పినవారు రాళ్లు వేయడానికో లేకపోతే కారుకు అడ్డంగా పడుకోవడానికో తప్ప.. ప్రజలు ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నారు. వారికి అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అందుకే ఈ సొల్లు కబుర్లను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
    చంద్రబాబు 5 ఏళ్ల పరిపాలన దుష్ట పరిపాలన. జగన్‌గారు పాలించిన ఈ మూడేళ్లు అద్భుత పాలన. అందుకే మళ్లీ జగన్‌గారిదే గెలుపు. వారు ఎంత కట్టు కట్టుకుని వచ్చినా, వారికి ఓటమి తప్పదు. వారు ఎన్ని మాటలు చెప్పినా, కబుర్లు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.

Back to Top