చంద్రబాబు పల్లకీ మోసే బదులు పార్టీని విలీనం చేయొచ్చు కదా..

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు 
 
పవన్‌ కల్యాణ్‌ అసలు రాజకీయ నాయకుడే కాదు

కేవలం చంద్రబాబును సీఎం చేయడానికే పార్టీ పెట్టాడు.

ఎవరి పల్లకీనో మోయడానికి నువ్వు పార్టీ పెట్టడం ఎందుకు..?

ఆ సామాజికవర్గాన్ని చంద్రబాబు దొడ్లో కట్టేయాలనేదే ఆయన తపన

ముద్రగడను బతికుండగానే వేధించిన వ్యక్తి చంద్రబాబు

అలాంటి బాబుకు ఊడిగం చేయడానికి సిగ్గనిపించడం లేదా?

పవన్‌ కల్యాణ్‌ అభిమానులు, సామాజికవర్గీయులు ఈ ప్యాకేజీ రాజకీయాలకు బలికావద్దు: మంత్రి 
అంబటి రాంబాబు

ప్రతి పక్షాలు చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నాయి...

మూడో భాగం సీట్లంటూ కేవలం 24తో సరిపెట్టుకున్న పవన్

కనీసం తానెక్కడ పోటీ చేస్తాడో కూడా ప్రకటించుకోలేని దుస్థితి పవన్ ది

జగన్‌ గారు 175 స్థానాల్లో గెలుపు దిశగా దూసుకుపోతున్నారు.

చంద్రబాబు పల్లకీ మోసే బదులు చిరంజీవిలా విలీనం చేసి సినిమాలు తీసుకో: మంత్రి అంబటి 
రాంబాబు

 

ప‌ల్నాడు: చంద్రబాబు పల్లకీ మోసే బదులు పార్టీని విలీనం చేయొచ్చు కదా..అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప‌వ‌న్ కళ్యాణ్‌కు సూచించారు. 60–70 సీట్లన్నారు..పవన్‌ మేం మూడో భాగంతో పోటీ చేస్తాం అని అట్టహాసంగా ప్రకటించాడు.   గ్యారెంటీగా 70 అనుకుంటే చివరికి 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు తీసుకొచ్చాడని ఎద్దేవా చేశారు.  రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

మూడో భాగం అని 24తో సరిపెట్టుకున్నాడు:
– చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడిగా, పాక్షికంగా అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. 
– ఒకటైతే క్లారిటీ ఇచ్చారు...జనసేన అనే రాజకీయ పక్షం 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలకు మాత్రమే పోటీచేయబోతోందని చెప్పారు. 
– కానీ ఇంకోకటి రహస్యంగా పెట్టారు. బీజేపీ కూడా ఈ పొత్తులో ఉంది అని చెప్పారు. 
– కానీ వెనుక సింబళ్లు సైకిల్, గ్లాస్‌ మాత్రమే ఉన్నాయి. 
– బీజేపీ వారు మాత్రం మేం పొత్తులో ఉన్నామని ఇంతవరకూ చెప్పలేదు. 
– మేము, జనసేన కలిసి పోటీచేస్తున్నాం అని బీజేపీ చెప్తోంది..మేమూ, టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తున్నాం అన్న మాట లేదు. 
– వారి మధ్య పొత్తు ఉన్నా..లేకున్నా మాకేమీ అభ్యంతరం లేదు. 
– వారు మాత్రం చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. ఎక్కడా వారికి స్పష్టత లేదు. 
– పొత్తులో మాత్రమే వారికి స్పష్టత ఉంది. చంద్రబాబును జైళ్లో పెట్టిన రోజునే పవన్‌ ఎగేసుకుంటూ వెళ్లి మేం పొత్తులో వెళ్తున్నాం అని చెప్పాడు. 
– అమాయకులైన కాపు సోదరులు, జనసేన కార్యకర్తలు ఇక మా పవన్‌ కల్యాణ్‌ తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతాడని భావించారు. 
– నాకు సీఎం ఏమన్నా కొత్తా అని చంద్రబాబు అంటే ఇక పవన్‌ కల్యాణే సీఎం అనుకున్నారు అమాయకులు. 
– 60–70 సీట్లన్నారు..పవన్‌ మేం మూడో భాగంతో పోటీ చేస్తాం అని అట్టహాసంగా ప్రకటించాడు. 
– గ్యారెంటీగా 70 అనుకుంటే చివరికి 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు తీసుకొచ్చాడు. 

లెక్కల్లో పవన్‌ కల్యాణ్‌ తిక్క వేరయా..!:
– పవన్ కల్యాణ్ తనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు అంటే ఒప్పుకోవడం లేదు. మొత్తం 40 సీట్లు పోటీ చేస్తున్నాం అంటున్నాడు. 
– మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో 21 అసెంబ్లీ స్థానాలు కూడా లెక్కలో వేసుకుని 40 చెప్తున్నాడు..
– నాకు కాస్త తిక్కుంది..దానికో లెక్కుంది అంటాడుగా..ఇదీ ఆయన లెక్క...
– నీకు తిక్క ఉండొచ్చు..ఆ తిక్కతో నీకు తప్పుడు లెక్క ఉండొచ్చు...కానీ జనసైనికులకు ఒకటే తిక్క. 
– నువ్వు సీఎం కావాలనేదే వారి తిక్క..ఆ తిక్కను ఈ రోజు నువ్వు దించేశావ్‌..
– కాపు సోదరులారా, జనసేన కార్యకర్తలారా..చంద్రబాబు జనసేనకు 40 సీట్లు ఇచ్చాడని మీరు నమ్మాల్సిందే. 
– సీఎం సీఎం అని గొంతుచించుకున్న వారు రేపు తాడేపల్లిగూడెం  వెళ్లి ఎమ్మెల్యే అని అరవాలి. 
– చంద్రబాబు ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించాడు..వాళ్లబ్బాయి లోకేశ్‌ ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించాడు..ఆయన మామ బాలకృష్ణ ఎక్కడ పోటీ చేస్తాడో కూడా ప్రకటించారు. 
– కానీ నీకు 24 సీట్లిస్తే ఎక్కడ పోటీ చేస్తావో ప్రకటించుకోలేని దుస్థితిలో ఉన్నావేమయ్యా..? 
– అంటే రహస్యమా..? పోటీ చేయవా..? పార్లమెంటుకు పోటీ చేస్తావా? 
– పవన్‌ కల్యాణ్‌ టోటల్‌ కన్ఫ్యూజన్‌లో ఉన్నాడు...ఈ రోజు వాళ్ల ముఖాలు చూస్తే ఓడిపోయే ముఖాలనేది చాలా క్లియర్‌గా అర్ధమవుతుంది. 

ఎవరి పల్లకీనో మోయడానికి నువ్వు పార్టీ పెట్టడం ఎందుకు..?:
– అసలు నీకు సంకల్పం ఉందా పవన్‌ కల్యాణ్‌..? 
– ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే సంకల్పం..జనసేనను వృద్ధిలోకి తీసుకురావాలనే సంకల్పం నీకుందా? 
– నిజమైన సంకల్పం ఉన్నవారు...చిత్తశుద్ధి ఉన్న వారు జగన్‌ గారిలా ఉంటారు. 
– జగన్‌ గారు పార్టీని స్థాపించినప్పుడు తనతో ఆయన తల్లి విజయమ్మ గారు తప్ప ఇంకెవరూ లేరు. 
– అయినా వెనుకడుగు వేయలేదు. ఎవరి చంకో ఎక్కాలని ప్రయత్నం చేయలేదు. 
– బ్రహ్మాండంగా పోటీ చేసి మొదటి సారి ముఖ్యమంత్రి కాకపోయినా జయించుకుంటూ వెళ్లారు. 
– ప్రజలతోనే పొత్తు అన్నారు...చివరికి 151 సీట్లు గెలుచుకుని ముఖ్యమంత్రి అయ్యారు. 
– మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు..175 సీట్లూ టార్గెట్‌గా వెళ్లబోతున్నాం. 
– సిగ్గుంటే..బుద్దుంటే జగన్ గారిని చూసి రాజకీయాలు నేర్చుకోమని పవన్ కల్యాణ్ కి చెప్తున్నా. 
– ఎవరి పల్లకీనో మోయడానికి పార్టీలు పెట్టే దౌర్భాగ్యమైన పరిస్థితి. 
– పార్టీ పెట్టి..సీఎం అవుతాననే భ్రమలు కల్పించి నీ అభిమానులను, నీ సామాజికవర్గం వారిని వెన్నుపోటు పొడిచావు. 
– చిరంజీవి గారు పార్టీ పెట్టి 18 సీట్లు గెలిచాడు. ఇక రాజకీయాలు లాభం లేదని విలీనం చేసి సినిమాలు తీసుకుంటున్నాడు. 
– నువ్వు కూడా పల్లకీ మోసి పరువు పోగొట్టుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకో. 
– మీ అన్నగారిలా ఆదర్శంగా ఉండు తప్ప మోసం చేయవద్దు. 

పవన్‌ కల్యాణ్‌ అసలు రాజకీయ నాయకుడే కాదు:
– పవన్‌పై నాకు కోపం కాదు...అతను ఒక రాజకీయ నాయకుడు కాదు..రాజకీయాలు చేయాలని రాలేదు. 
– అతను వచ్చింది కేవలం చంద్రబాబును బతికించాలనే ప్రయత్నంతోనే. 
– చాలా కాలంగా చంద్రబాబు సామాజికవర్గానికి, పవన్‌ కల్యాణ్‌ సామాజికవర్గానికి మధ్య ఉన్న అంతరాన్ని సరిచేయడం కోసమే పార్టీ పెట్టాడు. 
– వంగవీటి రంగా హత్య తర్వాత ఆ రెండు సామాజికవర్గాల మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చడానికే ఆయన పార్టీ పెట్టాడు. 
– చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో పార్టీ పెట్టాడు. 
– ఆ సామాజికవర్గాన్ని లాక్కొచ్చి చంద్రబాబు దొడ్లో కట్టేయాలని ఆలోచనతో పార్టీ పెట్టిన వ్యక్తి. 
– ముద్రగడ పద్మనాభం గారిని కూడా బతికుండగానే వేధించిన వ్యక్తి నారా చంద్రబాబునాయుడు. 
– అలాంటి చంద్రబాబుకు ఊడిగం చేయడానికి సిగ్గనిపించడం లేదా? 
– ఈ రోజు అసలు నీ ముఖంలో నెత్తురు చుక్క ఉందా? ద్రోహం చేస్తున్నావనేది నీ గుండె చెప్తోంది. అందుకే నువ్వు సరిగ్గా మాట్లాడలేకపోయావ్‌. 
– ఈ రోజు సీట్ల పంపకాన్ని చూస్తే నీ అభిమానులు, కార్యకర్తలకు ఏడవాలో నవ్వాలో అర్ధం కాలేదు. 
– ఇది ఒక అపవిత్రమైన పొత్తు అని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. 
– టీడీపీ, జనసేనలకు రాజకీయంగా బతుకు లేదని తెలిసి ఒకరిని ఒకరు పట్టుకుని ఢిల్లీకి తిరుగుతున్నారు. 
– బీజేపీ వారు వస్తారో రారో తెలియదు కానీ వచ్చేస్తారు అని చెప్తున్నారు. 
– మరి బీజేపీ లేకుండా ప్రెస్‌మీట్‌ ఎందుకు పెట్టారో అర్ధం కావడం లేదు. 
– బీజేపీకి కూడా భాగం ఉందని చెప్తున్నారు..వాళ్లు మాత్రం మాట్లాడటం లేదు. 
– ప్రతిపక్షాలు, ప్రత్యర్థి రాజకీయ పక్షాలు పూర్తిగా కన్ఫ్యూజన్‌లో ఉన్నాయి..
– వైఎస్సార్సీపీ మాత్రం నేరుగా సిద్ధమై 175 స్థానాలు టార్గెట్‌గా ముందుకు వెళ్తున్నాం. 
– మళ్లీ ఈ రాష్ట్రంలో వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం ఎందుకు ఓట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయాలి?:
– జగన్‌ గారిని ఎదర్కొనే దమ్ము లేక వారిద్దరూ కలిశారు. కానీ రాష్ట్ర శ్రేయస్సు కోసం కలిశామంటారు. 
– ప్రజలు వ్యతిరేకంగా ఉంటే ఇక మీరెందుకు కలవడం..?  వైయ‌స్‌ జగన్‌ గారు అన్యాయమైన పరిపాలన చేస్తుంటే ప్రజలే ఓడిస్తారు. 
– ఇక మీరంతా కలవాల్సిన అవసరం ఏముంది? బీజేపీ కోసం వెంపర్లాడటం దేనికీ..? 
– జగన్‌ గారు చాలా బలంగా ఉన్నారు కాబట్టే..ఇంతమంది కలిసినా జగన్‌ గారు ఏమీ చేయలేని స్థాయిలో ఉన్నారనేది సుస్పష్టం. 
– మీరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా..ఎన్ని జిత్తులేసినా మీ పరిస్థితి ఏంటో ఈ రోజుతో తేలిపోయింది. 
– జనసేనకు 24 సీట్లిస్తే 5 ప్రకటించాడు..మిగతావి ప్రకటించుకోలేని పరిస్థితి. 
– పవన్‌ కల్యాణ్‌ తాను బీజేపీతో పొత్తులో ఉన్నానంటాడు..బీజేపీ మేం జనసేనతో పొత్తులో ఉన్నాం అంటోంది. 
– ఆ పొత్తులో ఉన్నాయన చంద్రబాబు పక్కన కూర్చుని సీట్లు పంపకం చేసుకుంటున్నాడు. 
– మరి ఇదేం విధానమో...ఇదేం మోసమో అర్ధం కావడం లేదు. 
– కేవలం 24 సీట్లకు కక్కుర్తి పడి చంద్రబాబు పల్లకీ మోసే దశకు పవన్‌ కల్యాణ్‌ వెళ్లాడు. 
– పవన్‌ కల్యాణ్‌ అభిమానులు, సామాజికవర్గం, కార్యకర్తలు ఈ ప్యాకేజీ రాజకీయాల్లో బలికాకండి. 
– రాబోయే ఎన్నికల్లో వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైయ‌స్ఆర్ సీపీ ఎందరు కట్టకట్టుకుని వచ్చినా 175 సీట్లు టార్గెట్‌గా వెళ్తున్నాం. 
– విజయం మళ్లీ మాదే...వైయ‌స్ జగన్‌ గారు మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. 
– పొత్తుల వల్ల ఓటు ట్రాన్స్‌ఫర్‌ కాదు. పవన్‌ కల్యాణ్‌ అలా అవుతుందని అంటున్నాడు. 
– నీకు 24 ఇస్తే ఎందుకు ఓట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయాలి..? 
– చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం ఎందుకు ఓట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయాలి? 
– కాస్త జ్ఞానం ఉన్న ఏ కాపు కులస్తుడూ పవన్‌ కల్యాణ్‌ మాట వినే పరిస్థితి లేదనేది వాస్తవం. 
– 100 శాతం వైయ‌స్ఆర్ సీపీ విజయఢంకా మోగించబోతోంది. 
– ఏపీ ప్రజలు కీలెరిగి వాత పెడతారు..ఇలాంటి పొత్తులన్నిటినీ కూడా తిరస్కరిస్తారు. 

Back to Top