చంద్రబాబే ఆరిపోయే దీపం... అందుకే ఆ అరుపులు

మంత్రి అంబటి రాంబాబు
 
పోలీసులపైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
 
33 ఏళ్లుగా కుప్పంలో గెల్చినా ఒక్క పనీ చేయలేదు

చంద్రబాబుకు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుంది

అందుకే కుప్పంలో తరుచూ పర్యటిస్తున్నారు

గందరగోళం చేసి సానుభూతి పొందే ప్రయత్నం

మంత్రి అంబటి రాంబాబు వెల్లడి

ప్రజలన్నీ గమనిస్తున్నారు. వారికి వాస్తవాలు తెలుసు

కుప్పం ప్రజలకు జగన్‌గారిపై విశ్వాసం పెరిగింది

వచ్చే ఎన్నికల్లో అక్కడ చంద్రబాబుకు ఓటమి తప్పదు

కుప్పంలో బాబు చివరి జెండా పీకడం ఖాయం

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన మంత్రి అంబటి రాంబాబు 

తాడేపల్లి: చంద్రబాబే ఆరిపోయే దీప‌మ‌ని,  అందుకే ఆ అరుపులు అరుస్తున్నార‌ని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.  ఆ విధంగా ఏదో గందరగోళం చేసి, ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఏమంటున్నాడు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అట. ఎవరు ఆరిపోతున్నారయ్యా? ఎవరికి వెలుగు ఎక్కువ ఉంది? ఈ డైలాగ్‌ బాగా అర్ధం చేసుకోవాలి.  కుప్పంలో ఇంకా ఏమంటున్నాడు? రా జగన్‌మోహన్‌రెడ్డి, రా రాజేందర్‌రెడ్డి, రా ఎస్పీ. అందరూ కుప్పం వెళ్తే అక్కడ తేల్చుకుంటాడా? అది కదా ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటే. ఆ అరుపులు. కేకలు. ఆ బాడీ లాంగ్వేజ్, ఎప్పుడూ లేనటువంటి భాష. ఎస్పీ నీ ఇంటి మీదకు వస్తా అన్నాడు. ఏమిటా మాటలు. పోలీసులపైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచినంత ఈజీ కాదు. అధికారుల మీదకు వెళ్లడం.   1983 ఎన్నికల్లో చంద్రగిరిలో ఓడిపోయిన చంద్రబాబు, కుప్పంకు తరలిపోయి, అక్కడి నుంచి ఏడుసార్లు గెల్చి, ఎన్ని పదవులు చేపట్టినా, ఆ నియోజకవర్గానికి గత 33 ఏళ్లుగా ఒక్క పనీ చేయలేదు. అయితే ఈమధ్య పదే పదే కుప్పంకు వెళ్తున్నారు. కుప్పం మీద ప్రేమ ఎక్కువైందో లేక భయపడుతున్నారో తెలియదు. ఆయనకు ప్రేమ ఉండదు. అక్కడ తనకు ఓటమి తప్పదన్న భయం పట్టుకుంది కాబట్టే, పదే పదే అక్కడికి వెళ్లి, ప్రజలను మంచి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా ఈసారి కూడా కుప్పంలో గెలవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

2019 నుంచి అన్నీ ఓటమిలే:
    రాష్ట్రంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ ఏ ఎన్నికలు జరిగినా, అన్నింటిలోనూ చంద్రబాబు  ఓడిపోతున్నారు. మున్సిపల్‌ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, సర్పంచ్‌ ఎన్నికలు.. ఏవి జరిగినా అన్నింటిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతోంది.
కుప్పం నుంచి 33 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఎన్నికై, 14 ఏళ్లు సీఎంగా పని చేశారు. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కానీ ఏనాడూ కుప్పంను అస్సలు పట్టించుకోలేదు. కుప్పంకు ఆయన చేసింది జీరో.
అదే ఇవాళ ప్రభావం చూపుతోంది.
    అదే ఇవాళ అంటున్నాడు. గాలేరు నగరికి రూ.50 కోట్లు కేటాయిస్తే పూర్తవుతుందని అంటున్నాడు. మరి ఈ 33 ఏళ్లు నీవేం చేశావు? ఆ పని ఎందుకు చేయలేకపోయావు? చివరకు కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను కూడా పూర్తి చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాడు.

దిక్కు తోచక ఆరోపణలు. విమర్శలు:
    ఈ మూడేళ్ల నుంచి కుప్పంకు సీఎంగారు అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఆ విధంగా ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలు అమాయకులు కారు. వారికన్నీ తెలుసు. 
ఇవాళ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను జగన్‌గారి ప్రభుత్వం అమలు చేస్తోంది. కుప్పంలో కూడా ప్రతి ఒక్కటి అందిస్తోంది. అమ్మ ఒడి, నిరుపేదలకు ఇళ్ల పట్టాలు.. ఇలా ఎన్నెన్నో. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా కుప్పంలో కూడా అర్హతే ప్రాతిపదికన పథకాలు అమలు చేస్తున్నారు. తెలుగుదేశం వారికి కూడా పథకాలు అందుతున్నాయి.
    అందుకే ప్రజల్లో వైయస్సార్‌సీపీ ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతోంది. ఇన్నాళ్లూ చంద్రబాబు చేసిన మోసం, కట్రలు, కుతంత్రాలు ప్రజలకు అర్ధమయ్యాయి. వారు ఇవాళ తమ స్వరం వినిపిస్తున్నారు. అందుకే చంద్రబాబు సర్వం పోగొట్టుకున్నాడు. మండలాలు, మున్సిపాలిటీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు అన్నీ పోగొట్టుకుని, సర్వ మంగళానికి సిద్ధంగా ఉండి, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఊరూరు తిరుగుతున్నాడు.

ఆయనది అవసర బంధమే:
    మీరు చూశారు. లోకల్‌ బాడీ ఎన్నికలకు కూడా వెళ్లాడు. ఒంగి ఒంగి నమస్కారాలు పెట్టాడు. అయినా ఒక్కరిని కూడా ప్రజలు గెలిపించలేదు. తాము జగన్‌గారి పక్షాన ఉన్నామని చెప్పారు. అసలు కుప్పంకు, నీకు ఉన్న బంధం ఒక రాజకీయ బంధమా? లేక ప్రేమ బంధమా? కానే కాదు, అది కేవలం అవసర బంధం మాత్రమే. 33 ఏళ్లు నిన్ను ప్రజలు మోస్తే, అక్కడ కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదు. ఇప్పటికీ ఆర్‌ అండ్‌ బీ అతిథిగృహంలో ఉంటున్నాడు. చంద్రగిరిలో ఓడిపోయావు కాబట్టి, నీ అవసరాల కోసం కుప్పంకు పోయావు. ఇన్నేళ్లుగా కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదు. చివరకు ఇల్లు కూడా అద్దెకు తీసుకోలేదు.

నిన్నూ ఓడిస్తారు:
    ఇవన్నీ ప్రజలు గుర్తించారు. వారిలో విశ్వాసం పెరిగింది. చంద్రబాబు ఏమీ చేయలేదు కాబట్టి, బుద్ధి చెప్పాలని నిర్ణయించారు కాబట్టే, ఇవాళ అక్కడ ఊరూరు తిరుగుతున్నారు. మంగళగిరిలో నీ కొడుకు జెండా పీకేశారు. ఇవాళ కుప్పంలో నీకు కూడా చివరి జెండా పీకేయడానికి ప్రజలు సిద్ధమయ్యారు. అందుకే గందరగోళానికి గురై ఏదేదో మాట్లాడుతున్నాడు. మూడు రోజులుగా చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నాడు. కుప్పం కాలిపోతోంది అంటూ పేపర్లు రాస్తున్నాయి.
ఇవాళ కాలుతోంది. రేపు కూలుతుంది. ఆ పరిస్థితి వచ్చింది.

జెండాలు పీకి..ఏమిటీ దౌర్జన్యం?:
    చంద్రబాబుగారు, మీ నియోజకవర్గానికి మీరు వెళ్లండి. మాకేం అభ్యంతరం లేదు. మీ పార్టీ జెండాలు కట్టుకోండి. స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోండి. మాకేం అభ్యంతరం లేదు. కానీ మా పార్టీ కార్యకర్తలు తమ ఇళ్ల మీద మా పార్టీ జెండాలు కట్టుకుంటే మీకేమిటి అభ్యంతరం? వాటిని కూడా తీసేస్తారా? అంటే నీవు బయలుదేరి వస్తే, మా పార్టీ కార్యకర్తలు కూడా జెండాలు పీకి, మీ పార్టీ జెండాలు కట్టుకోవాలా? ఏమిటి నీ దౌర్జన్యం?
    మీ కార్యకర్తలను రెచ్చగొట్టి, దౌర్జన్యం చేయించి, మా తోరణాలు పీకించి, మా జెండాలు లాగించారు. అవన్నీ మీ ఎల్లో మీడియాలో రాకపోవచ్చు. కానీ ఇతర మీడియాలో రాలేదా? టీడీపీ కార్యకర్తలు పచ్చ చొక్కాలు తొడుక్కుని రోడ్లపై వీరంగం చేయలేదా? దాడులు చేయలేదా?
అందుకే వైయస్సార్‌సీపీ కార్యకర్తలు స్పందించారు. మీరు దాడి చేస్తే ఊర్కోవాలా? మా ఇంట్లో మేం కట్టుకున్న జెండాలు పీకితే మా కార్యకర్తలు ఊర్కుంటారా? అందుకే రియాక్ట్‌ అయ్యారు.
    అంతే, ఇక ఎల్లో మీడియాలో దాన్ని పదే పదే చూపారు. అసలు దృశ్యాలు ఆపేసి, అవే చూపి, కుప్పంలో దాడులు, జగన్‌గారి ప్రభుత్వం రౌడీయిజమ్‌ చేస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం రగిలిపోతోందని నిందిస్తున్నారు.

     ఎవరు పౌరుషంగా ఉండాలి?:
    మీరు వెళ్లి మా పార్టీ వారి ఇళ్ల మీద జెండాలు పీకడం. మావాళ్లు స్పందిస్తే, మాది అన్యాయం అని మాట్లాడడం. నీకు మీడియా ఉందని పదే పదే మమ్మల్ని నిందించడం. బురద చల్లడం. ఏమిటో నాకు అర్ధం కావడం లేదు. రెచ్చగొడుతున్నాడు అక్కడ. ఈ దౌర్భాగ్య పనులకు పాల్పడిన చంద్రబాబు రెచ్చగొడుతున్నాడు.
    అందరూ పిడికిలి బిగించాలి. పౌరుషంగా ఉండాలంట. ఏదో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటున్నట్లు. అందరూ పిడికిలి బిగించాలంట. ఎవరబ్బా పిడికిలి బిగించేది. పౌరుషంగా ఉండాలంట. ఎవరు ఉండాలి. ఈ విధంగా అనేక రకాల మాటలు మాట్లాడి ఏదో కార్యక్రమాలు చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. 

ఫ్రస్టేషన్‌లో చంద్రబాబు. అందుకే..:
    175 సీట్లు గెల్చుకోవడం తమ ధ్యేయమని జగన్‌గారు అన్నారు. అలా మేము గెలుస్తాం కూడా. చంద్రబాబు బాడీ లాంగ్వేజ్, ఆయన ఫ్రస్టేషన్‌ చూస్తే అర్ధం అవుతుంది. అక్కడ (కుప్పం) కూడా మేం గెలవబోతున్నాం. ఆయన ప్రవర్తన చూస్తే, కుప్పం జారిపోతుందని చంద్రబాబుకు అర్ధమైందని తెలుస్తుంది. కుప్పం కూలిపోతుందన్న ఆవేదనతో చంద్రబాబు ఉన్నాడు. కుప్పంలో కూడా వైయస్సార్‌సీపీ విజయకేతనం ఎగరవేయబోతున్నది. అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
ఇన్నాళ్లూ అక్కడ మేనేజ్‌ చేశాడు కాబట్టే, చంద్రబాబు గెలుస్తూ వచ్చాడు. అంతేకానీ ఏనాడూ చంద్రబాబు అక్కడ మేలు చేయలేదు.
    అదే జగన్‌గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే వారికి మేలు జరిగింది. వారిలో విశ్వాసం పెరిగింది. అందుకే అన్ని ఎన్నికల్లో వైయస్సార్‌సీపీని గెలిపించారు. అక్కడ సరైన నాయకత్వం వచ్చింది. జడ్పీటీసీలు, మున్సిపల్‌ ఛైర్మన్లు వచ్చారు. అందుకే చంద్రబాబు పనై పోయింది. అదే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నది నిజం.

 ఆ నీచ రాజకీయాలు నీవి:

    పులివెందులకు వెళ్లి జగన్‌రెడ్డిగారిని ఓడిస్తా అంటున్న చంద్రబాబు.. ముందు నీ కుప్పం సంగతి చూసుకో. అక్కడ నీ పరిస్థితి ఏమిటో తెలుసుకో. ఇంకా మాట్లాడితే, జగన్‌గారు తన బాబాయిని చంపారని పిచ్చి విమర్శలు చేస్తున్నాడు. ఏమిటి ఆ మాటలు. ఎంత అన్యాయమైన మాటలు. అధికారం కోసం చంపే నీచ రాజకీయాలు చేసేది నీవు. 
    అదే వైయ‌స్‌ జగన్‌గారు ముక్కుసూటిగా వెళ్తారు. నిజాయితీతో పని చేస్తారు.
అందుకే గత ఎన్నికల్లో ఆయనకు 151 సీట్లు ఇచ్చారు. రేపు 175 సీట్లు ఇస్తారు. నీ కుప్పంలో కూడా గెలుస్తాం. అందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు.

దాడులు చేసి దుష్ప్రచారం:
    ఆ విషయం నీకు స్పష్టంగా తెలుసు కాబట్టే, ఫ్రస్టేషన్‌లో ఏదేదో మాట్లాడుతున్నావు. దౌర్జన్యం నీవు చేసి, మేమే చేశామని ప్రచారం చేస్తున్నావు. నీ ఎల్లో మీడియాలో ఎంత ప్రచారం చేసినా ప్రజలు నమ్మబోరు. వారికి వాస్తవాలు తెలుసు. 
    తన మీదకు వస్తున్నారు. దాడి చేస్తున్నారని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు. అందుకే ఆయనకు సెక్యూరిటీ పెంచారేమో? పెంచుకోనివ్వండి. మాకేం అభ్యంతరం లేదు. కానీ ఎవరండి చంద్రబాబు మీదకు పోయేది.. అంటూ మంత్రి శ్రీ అంబటి రాంబాబు అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top