లీకుల వల్లే ‘నారాయణ’కు నంబర్‌ వన్‌

మంత్రి అంబటి రాంబాబు

తాడేపల్లి: పదో తరగతి ప్రశ్నాపత్రాలు నారాయణ విద్యా సంస్థ‌ల‌ నుంచి లీక్‌ అయ్యాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నారాయణ కాలేజీ ప్రిన్సిపల్‌ స్టేట్‌మెంట్‌ తర్వాత విషయం బయటకొచ్చిందన్నారు. వీళ్లే పేపర్లు లీక్‌ చేసి మళ్లీ వీరే గొడవ చేస్తున్నారని మండిపడ్డారు. పేపర్లు లీక్‌ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారని, లీకుల వల్లే నారాయణ విద్యా సంస్థలకు నంబర్‌ వన్‌ వస్తోందన్నారు. విచారణ తర్వాతే నారాయణను అరెస్టు చేశారని మంత్రి అంబటి చెప్పారు. 

Back to Top