మళ్లీ సీఎంగా వైయ‌స్ జగనే కావాలి

మంత్రి అంబ‌టి రాంబాబు

పవన్ కళ్యాణ్ చంద్రబాబును భుజానికి ఎత్తుకున్నాగెలిచేది వైయ‌స్‌ జగనే 

కొవ్వూరు మండలంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న మంత్రులు తానేటి వ‌నిత‌, అంబ‌టి రాంబాబు

తూర్పుగోదావరి:  పాద‌యాత్ర‌లో, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిలబెట్టుకున్నారు కాబట్టే మళ్లీ సీఎంగా వైయ‌స్ జగనే కావాలని మంత్రి అంబ‌టి రాంబాబు అన్నారు. పేదల కోసం ఆయన నిరంతరం ఆలోచిస్తున్నారని  తెలిపారు.  రాష్ట వ్యాప్తంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమలు జరగుతున్నాయని చెప్పారు. 
కొవ్వూరు మండలం పెనకన మెట్ట గ్రామంలో మంత్రి అంబటి రాంబాబు, హోం మంత్రి తానేటి వనిత మంగళవారం పర్యటించారు. గ్రామంలో కోటి 35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, రైతు భరోసా కేంద్రం, సచివాలయ భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ.. చంద్రబాబు మహిళలను మోసం చేశాడు. బంగారు రుణాలు మాఫీ అంటూ చేతులెత్తేశాడు. చంద్రబాబు దుర్మార్గపు పాలనలో పవన్‌ పాత్ర కూడా ఉంది. సీఎం వైయ‌స్ జగన్‌ ఇచ్చిన హామీలను అన్ని అమలు చేశారు. అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి అందిస్తున్నాం.

వై ఏపీ నీడ్స్ జగన్ అని ప్రజల్లోకి వెళ్తున్నాం. ఏ రాష్ట్రాల్లో కూడా అమ్మ ఒడి లాంటి పథకం లేదు. పేదల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం జగన్‌ రాష్ట్రానికి కావాలి. ఆయనే మరలా రాష్ట్రానికి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. 2024లో పేదలకు-పెత్తందారులు జరిగే ఎన్నిక ఇది. పేదల తరపున పోటీ చేసి గెలిచే వ్యక్తి సీఎం జగన్‌. పవన్ కళ్యాణ్ చంద్రబాబును భుజానికి ఎత్తుకున్నాగెలిచేది వైయ‌స్‌ జగనే  అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

Back to Top