రాష్ట్రానికి నష్టం జరిగే విధానాన్ని మేం ఒప్పుకోం

మంత్రి అంబటి రాంబాబు

కృష్ణా జలాల పునఃపంపిణీని ఆపేయాలని కేంద్రాన్ని కోరాం

కృష్ణా జలాలపై న్యాయ పోరాటం

ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసే అసత్య కథనాలకు మేం భయపడం

 విజ‌య‌వాడ‌: రాష్ట్రానికి నష్టం జరిగే విధానాన్ని మేం ఒప్పుకోమ‌ని మంత్రి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలపై ఉన్న అడ్డంకులను తొలగించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని తెలిపారు. కృష్ణా జలాల పునఃపంపిణీని ఆపేయాలని కోరామని, ఈ మేరకు ప్రధానికి సీఎం వైయ‌స్ జగన్‌ లేఖ రాశారన్నారు. కృష్ణా జలాలపై న్యాయ పోరాటం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కృష్ణా జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామ‌న్నారు. కొత్తగా విధి విధానాలు రూపొందించడానికి ఒప్పుకోం. ఏపీకి రావాల్సిన ప్రతి నీటిబొట్టును తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. అన్యాయంగా తీసుకెళ్తామంటే ఒక్క నీటిబొట్టును కూడా వదులుకోమ‌ని చెప్పారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసే అసత్య కథనాలకు మేం భయపడమ‌ని హెచ్చ‌రించారు. సీఎం వైయ‌స్ జగన్‌పై బురదచల్లడమే లక్ష్యంగా రామోజీ, రాధాకృష్ణ పనిచేస్తున్నారు అంటూ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శనివారం మంత్రి అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

 జలశక్తి నిర్ణయంపై ‘సుప్రీం’లో న్యాయపోరాటంః
ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నీటిపంపకాలకు సంబంధించి బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు ‘టరమ్స్‌ ఆఫ్‌ రిఫెరెన్స్‌’ను ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ లో, సెక్షన్‌ 89లో నిర్దేశించగా.. కొత్త టరమ్స్‌ ఆఫ్‌ రిఫెరెన్స్‌ ఇవ్వడానికి వీల్లేదు. ఇది చట్టవిరుద్ధం. ఇది అంగీకరించేది కాదు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు నష్టం కలిగించే విషయం. దీన్ని రాష్ట్రప్రభుత్వం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. అన్యాయంగా, అక్రమంగా టరమ్స్‌ ఆఫ్‌ రిఫెరెన్స్‌లను ఇవ్వడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్‌ గారు ముందుగానే మోదీ, అమిత్‌షా గార్లకు లేఖలు రాసినతర్వాత కూడా గెజిట్‌ పబ్లిష్‌ కావడంతో దీనిపై న్యాయపోరాటం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడిస్తున్నాను. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించి జలశక్తి శాఖ నిర్ణయం అక్రమమని మా వాదనలు వినిపిస్తాం. మా రాష్ట్ర రైతులకు సంబంధించి వారికి అన్యాయం జరిగితే మేం ఊరుకోము. బ్రిజేష్‌ కుమార్ ట్రిబ్యునల్‌ కొత్త విధివిధానాలపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌లీవ్‌ పిటీషన్‌ ఫైల్‌ చేస్తుంది. ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తుందని స్పష్టం చేస్తున్నాను. 

రైతులకు అన్యాయం జరగనివ్వంః
బచావత్‌ ట్రిబ్యునల్ ప్రకారం ఆంధ్రనీటి వాటా 512 టీఎంసీలకు డిమాండ్‌ చేస్తున్నాం. రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరిగేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటే మా ప్రభుత్వం ఊరుకోదు. చట్టపరంగా పోరాటం చేసి మా హక్కుల్ని మేము సాధించుకుంటాం. బచావత్‌ కమిషన్‌ ట్రిబ్యునల్‌ 1976లో నిర్ణయించిన నీటివాటాల ప్రకారమే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు దక్కాలి. ఉమ్మడి ఆంధ్ర విడిపోయిన తర్వాత కూడా బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ పరిశీలనలో ఇదే అంశం ప్రస్తావనకు రావాల్సి ఉండగా.. ఇప్పుడు తాజాగా కేంద్ర జలశక్తి నిర్ణయంతో ఆంధ్రకు నీటివాటా నష్టం వాటిల్లనుంది. ప్రాజెక్టుల వారీగా ఉభయరాష్ట్రాల అంగీకారం మేరకు తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రకు 512 టీఎంసీల వాటా కేటాయింపునకు కేంద్రం ముందు అంగీకారం తెలిపింది. అయితే, ఆ నిర్ణయాన్ని పక్కకుతోసి చిన్నచిన్న నీటి వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేసిన బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌కు ఇప్పుడు కొత్తగా విధివిధానాలు (టరమ్స్‌ ఆఫ్‌ రిఫెరెన్స్‌) ఇవ్వడం చట్టవిరుద్ధం. 

ఒక్క నీటిబొట్టునూ వదులుకోంః
 మొదట్నుంచీ కృష్ణాజలాల్ని రైట్‌రాయల్‌గా సాగునీటి ప్రాజెక్టులవారీగా సరైనరీతిలో చట్టబద్ధంగా వాడుకుంటున్నది... దివంగత మహానేత వైఎస్‌ఆర్‌ గారి హయాం నుంచేనని మేం సగర్వంగా చెబుతున్నాం. వారి ఆశయస్ఫూర్తిని కొనసాగిస్తూ ఆంధ్ర రైతులకు అన్యాయం జరిగిగితే మేం ఊరుకోం. రాష్ట్రం విడిపోయినప్పటికీ, సోదర రాష్ట్రమైన తెలంగాణకూ చట్టబద్ధంగానే నీటి వాటానిచ్చేందుకు సిద్ధమే గానీ.. అన్యాయంగా ఒక్క నీటిబొట్టు కూడా రాష్ట్రం నుంచి వదులుకోవడానికి జగన్‌మోహన్‌రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న రాష్ట్రప్రభుత్వం అంగీకరించదని స్పష్టం చేస్తున్నాను. 

ప్రధానికి సీఎం లేఖః
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా చీలిపోయి ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం సెక్షన్‌ 89లో నీటిపంపకాల అంశాల్ని తెలియపరిచారు. వాటిని పరిశీలించించేందుకు మాత్రమే కేంద్రం బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ను (ఎక్స్‌టెండ్‌) కొనసాగింపు చేశారు. కానీ, కేంద్ర జలశక్తి శాఖ మాత్రం నిన్న కొత్తగా విధివిధానాల వర్తింపు (టరమ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌)ను ఇస్తూ గెజిట్‌ పబ్లికేషన్‌ ఇచ్చింది. అయితే, ఈ గెజిట్‌ పబ్లికేషన్స్‌కు ముందే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీగారికి లేఖ రాస్తూ దీన్ని అభ్యంతరపెడుతూ తమ వాదనను విన్నవించారు. అయినప్పటికీ, ట్రిబ్యునల్‌ టరమ్స్‌ ఆఫ్‌ రిఫెరెన్స్‌కు గెజిట్‌ను పబ్లిష్‌ చేశారు. 

బ్రిజేష్‌ట్రిబ్యునల్‌ నివేదికపై సుప్రీం స్టే ఉందిః
కృష్ణానదీ జలాలకు సంబంధించి నాలుగురాష్ట్రాలకు మధ్య పంపకాలు, వివాదాలు సుదీర్ఘకాలంగా జరుగుతూనే ఉన్నాయి. అంతకుముందు బచావత్‌ ట్రిబ్యునల్‌ 1976లో కేటాయించిన పంపకాల ఆధారంగానే తర్వాత వచ్చిన ట్రిబ్యునల్స్‌ ప్రామాణికంగా తీసుకుని పనిచేస్తున్నాయి. 2004లో ఇంకా మిగులు జలాలకు సంబంధించి బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ను కేంద్రం నియమించింది. అన్ని వాదనలు విన్న తర్వాత 2010లో బ్రిజేష్‌ కుమార్ ట్రిబ్యునల్‌ వారి నివేదికను కేంద్రానికి సమర్పించింది. దానివల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతుందని స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(ఎస్‌ఎల్‌పీ)ని సుప్రీం కోర్టులో వేయడం జరిగింది. దానిపై సుప్రీం స్టే కూడా ఇచ్చింది. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా సుప్రీంకోర్టుల్లో ఎస్‌ఎల్‌పీలు వేయడంతో అన్నింటినీ కలిపి ఒకచోట విచారణ చేయాలని నిర్ణయించి.. ఆమేరకు సుప్రీంలో విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా మరలా బ్రిజేష్‌కుమార్‌ –2 ట్రిబ్యునల్‌ మరో నివేదికను సమర్పిస్తే.. అంతకు ముందిచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు స్టే ఉండటంతో అది గెజిట్‌ కాలేదు. పబ్లిష్‌ కాలేదు. అమలు కాలేదు. 

పచ్చపత్రికల అడ్డగోలు రాతల్ని నమ్మొద్దుః
కృష్ణాజలాలకు సంబంధించిన రాష్ట్రానికి దక్కాల్సిన ప్రతీ నీటిబొట్టును రాబట్టుకునేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏవో కొన్ని పచ్చ పత్రికల్లో రాసిన అడ్డగోలు రాతల్లోని ప్రభుత్వ వాదనలు సమర్ధంగా లేనందునే నీటివాటా కోల్పోతున్నామనేది సరైంది కాదు. ఆ పత్రికల రాతల్ని కూడా మేం ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్‌ గారిపై బురదజల్లడమే లక్ష్యంగా ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పనిచేస్తున్నారు. వారెంతగా తాపత్రయపడినా ఈ రాష్ట్రంలోని రైతాంగం పచ్చపత్రికల రాతల్ని నమ్మరుగాక నమ్మరు. టీడీపీ, జనసేనతో పాటు పచ్చ పత్రికల విమర్శలకు మేము భయపడాల్సిన అవసరంలేదు. ఆ పత్రికల్లో రాసిన చెత్త రాతలకు మేము సమాధానం ఇచ్చుకుంటూ కూర్చోము. 

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి రాష్ట్రప్రయోజనాల కోసమే మాట్లాడుతారు. ఈ విషయంపై మేం గతంలో కూడా అనేకసార్లు చెప్పాం. మరోమారు కూడా చెబుతున్నాం. సీఎం గారు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటు టీడీపీ, జనసేన ఏవేవో కూరుకూతలు కూస్తారు. వాటిని మేం పట్టించుకునే పరిస్థితుల్లో లేము. రాష్ట్రప్రయోజనాలకు ఏమాత్రం విఘాతం కలగకుండా, చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం జగన్‌గారిదని మేం ఘంటాపథంగా చెబుతున్నాం. 

పొలిటికల్‌ బఫూన్‌లు పవన్‌కళ్యాణ్,లోకేష్ః
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో పాటు చంద్రబాబు కొడుకు లోకేష్‌లిద్దరూ పొలిటికల్‌ బఫూన్‌లు. వారిద్దరూ ఎప్పుడు ఏం మాట్లాడుతారో వాళ్లకే అర్ధంకావట్లేదు. వాళ్ల మాటలకు ఆ రెండు పార్టీల నేతలు జుట్టుపీక్కుంటున్నారు. ఎన్డీయేలో నుంచి చాలా కష్టపడి బయటకొచ్చి తెలుగుదేశానికి మద్ధతిచ్చానన్న పవన్‌కళ్యాణ్‌ మళ్లీ వెంటనే మాటమార్చేసి.. నేను ఎన్డీయేలోనే ఉన్నానంటాడు. టీడీపీ పూర్తిగా బలహీనపడిందని పవన్‌కళ్యాణ్‌ అంటుంటే.. రామోజీ, రాధాకృష్ణలేమో తెలుగుదేశం పార్టీకి సింపతీ బాగా పెరిగిందని రాసుకుంటున్నారు. నిన్న లోకేష్‌ఏమో రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలిసి బయటికొచ్చాక .. మా నాన్న అవినీతిని ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తాననని మీడియాకు చెబుతాడు. కనుక పవన్‌కళ్యాణ్, లోకేష్‌ మాటలు రాజకీయాల్లో ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరంలేదు. 

చంద్రబాబు అవినీతి భాగస్వామి పవన్‌కళ్యాణ్ః
2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అనేక స్కామ్‌లకు పాల్పడి ప్రజాధనాన్ని దోచుకున్న అవినీతిపరుడని రుజువైంది. అందుకే, ఆయన ఈరోజు జైల్లో ఉన్నాడు. మరి, 2014 ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉండి అధికారంలోకి తెచ్చి ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్‌కళ్యాణ్‌ కూడా- చంద్రబాబు అవినీతిలో తనదైన వాటా తీసుకునే ఉంటాడుకదా..?. అందుకే, చంద్రబాబు దొంగగా మారడంలో పవన్‌కళ్యాణ్‌ పాత్ర కూడా ఉంటుందని చెబుతున్నాను. 

ప్రజల ముందు పారని జనసేన, టీడీపీ పొత్తుః
టీడీపీ బలహీనపడితే తన మద్దతుతో బలం పుంజుకుంటుందని పొత్తు పెట్టుకున్న జనసేన.. క్షేత్రస్థాయిలోకొచ్చేసరికి చతికిలపడిపోయింది. పవన్‌ కళ్యాణ్‌ ఆ రెండు పార్టీల పొత్తు ప్రకటించిన తర్వాత జరిగిన మూడు సభల స్పందనే ఇందుకు నిదర్శనం. ఆయన టీడీపీ బలహీనపడిందని ప్రజలకు చెబుతున్నాడు. తీరాచూస్తే.. టీడీపీతో పొత్తు ఎవరికీ ఇష్టం లేకపోవడంతో జనసేన పూర్తిగా బలహీనపడిందని ఆయన తెలుసుకోవాలి. ఇరుపార్టీల అధినేతలు ఇష్టపడి పొత్తు పెట్టుకున్నంత మాత్రానా ఆయా పార్టీల కేడర్‌కు మాత్రం వారి నిర్ణయాన్ని అంగీకరించడంలేదు. 

Back to Top