తుప్పు పట్టిన సైకిల్ ఇక స్మశానానికే

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు 

పేదలకీ పెత్తందార్లకీ జరిగే కురుక్షేత్రంలో విజయం పేదలదే

రానున్న కురుక్షేత్ర సంగ్రామానికి నువ్వొక్కడివే వస్తావా..? దత్తపుత్రడ్ని తెచ్చుకుంటావా..? 

మేం ఒక్కళ్లమే వస్తాం...జగన్‌ గారి సంక్షేమ సైన్యం వస్తుంది....: మంత్రి అంబటి రాంబాబు 

చంద్రబాబూ...ఇదే మీకు చివరి మహానాడు

తుప్పు పట్టిన సైకిల్‌ కు ఎలక్ట్రికల్ స్మశానంలో అంత్యక్రియలు చేయండి.

నీకూ నీ పార్టీకే భవిష్యత్తు లేదు..ఇక ప్రజలకేమిస్తావ్...: మంత్రి శ్రీ అంబటి రాంబాబు

 ఏ ఒక్క హామీనీ అమలు చేయని బాబు..మళ్లీ హామీలిస్తే నమ్ముతారా..?

 నీ జన్మలో ఒక్క వాగ్ధానమైనా నెరవేర్చావా చంద్రబాబూ..?

 చంద్రబాబు ప్రజల నెత్తిన వాగ్ధానాల టోపీ పెట్టాడు

 ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్నీ అమలు చేసిన నేత   వైయ‌స్‌ జగన్‌

 కులం పేరు ఎత్తితే చెప్పుతో కొట్టాలంటే మొదటిగా మీ తండ్రీ కొడుకులనే కొట్టాలి

 పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే తట్టుకోలేని నువ్వు వారిని ధనవంతుల్ని చేస్తావా..?

  క్యాష్ వార్ బాబుకే అలవాటు: మంత్రి అంబటి రాంబాబు

తాడేప‌ల్లి: టీడీపీకి ఇదే చివరి మహానాడు.. ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు అవుతుంద‌ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు. తుక్కు తుక్కయిన సైకిల్‌ను బాబు తొక్కలేరు. ఇచ్చిన వాగ్ధానాలు చంద్రబాబు ఎప్పుడైనా నెరవేర్చారా? అని ప్ర‌శ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు. ఒక్క హామీనైనా నిజాయితీగా అమలు చేశారా?. వాగ్ధానాలను నట్టేట ముంచిన చంద్రబాబును ఎవరు నమ్ముతారు?. బాబు జీవితమంతా ప్రజలను మోసం చేయడమే అని మంత్రి అంబటి మండిపడ్డారు. తాడేపల్లిలోని  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో  మాట్లాడారు.  

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:

చంద్రబాబు పదవీ దాహం వల్లే ఎన్టీఆర్‌ మృతి:
- రాజమండ్రి వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించింది.
- ఈ మహానాడులో ఎన్టీఆర్‌ చరిత్ర, ఆయన గొప్పతనం గురించి పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు. 
- ముఖ్యంగా చంద్రబాబు ఎన్టీఆర్‌ని పొగుతున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. 
- కారణం ఎన్టీఆర్‌ పూర్తి ఆరోగ్యంగా ఉండే వ్యక్తి..73 ఏళ్లకే చనిపోయే వ్యక్తి మాత్రం కాదు. 
- ఎన్టీఆర్‌ తాను 85 ఏళ్లు బతుకుతానని అనుకున్నాడని, చివరి మూడేళ్లు తన స్వగ్రామంలో బతకాలని అనుకున్నాడని జస్టిస్‌ చలమేశ్వర్‌ అన్న మాటలు పత్రికల్లో చూశా.
- అలాంటి వ్యక్తి ఎందుకు 73 ఏళ్లకే మరణించాడు..? కారణం అందరికీ తెలుసు. 
- చంద్రబాబు పదవీ దాహం వల్ల ఆయన మరణం సంభవించింది. 
- తనను అన్యాయం, ద్రోహం చేశారని ఎన్టీఆర్‌ గుండె ఆగి చనిపోయారు. 
- ఆనాడు ఎన్టీఆర్‌ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చాడు. 
- ఇప్పుడు ఆయన్ను ఎంత పొగుడుతున్నారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. 
- ఏదో ఒక రకంగా ఎన్టీఆర్‌ను మార్కెంటింగ్‌ చేసుకోవాలని ఈ రోజు తాపత్రయపడుతున్నారు. 
- ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని నిజంగానే చంద్రబాబుకు ఉందా..? నిజంగా ఇవ్వాలని ఉంటే ఆగేదా..? 
- మొన్నీమధ్యనే సినీనటుడు నారాయణమూర్తి మీరు కేంద్రంలో చక్రం తిప్పేటప్పుడు భారతరత్న ఎందుకు తీసుకురాలేదని నిలదీశాడు. 
- ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాల్సిందే..చంద్రబాబుకు సాధించలేకపోయాడు అంటే నీకు సిగ్గేయలేదా..? 
- కేవలం ఎన్టీఆర్‌ని మార్కెటింగ్‌చేసుకోవాలనే తాపత్రయమే తప్ప ఆయనకు భారతరత్న ఇప్పించాలనే ఆలోచనే చంద్రబాబుకు లేదు. 

ఇదే మీకు చివరి మహానాడు:
- చంద్రబాబూ ఇదే మీకు చివరి మహానాడు...
- చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ చేతులమీదుగా టీడీపీకి కూడా నూరేళ్లు నిండుతాయి. 
- 2019లోనే ప్రజలు దుర్మార్గమైన పరిపాలనను అంతం చేశారు..మళ్లీ అదే పాలనను తీసుకొచ్చే పరిస్థితి లేదు. 
- ఈ పార్టీ ఇంతటితో అంతరించి పోతుంది..ఎన్నికల తర్వాత ఉండదు. 
- నీ సైకిల్‌ తుప్పు పట్టిపోయింది..నువ్వు తొక్కలేకపోతున్నావ్‌..
- చివరికి మీ అబ్బాయి కూడా తొక్కలేకపోతున్నాడు..అందుకే దత్తపుత్రుడితో తొక్కించుకోవాలి అనుకుంటున్నావ్‌
- ఈ సైకిల్‌ స్క్రాప్‌కు కూడా పనికి రాకుండా 23 సీట్లు వచ్చాయి. 
- తుక్కుతుక్కు అయిన సైకిల్‌కి నువ్వు ఎలక్ట్రిఫికేషన్‌ చేయలేవు..
- ఆ సైకిల్‌ని తీసుకెళ్లి విద్యుత్‌ స్మశాన వాటికలో వేసి ఆ బూడిదను ముఖాన రాసుకోవాల్సిన పరిస్థితి రాబోతోంది. 
- చంద్రబాబు తన ప్రసంగం మధ్యలో తమ్ముళ్లు నిజమేనా..అంటాడు..అంటే ఆయన చెప్పేది ఆయనకే అనమానం..
- నువ్వు కార్లు పెట్టి తీసుకొచ్చిన జనమే కదా..అంత అనుమానం ఎందుకు..? 

నీ జన్మలో ఒక్క వాగ్ధానం అన్నా నెరవేర్చావా.?:
- అమ్మకు వందనం, యువగళంతో నిరుద్యోగ భృతి...వంటి హమీలెన్నో ఇచ్చాడు. 
- చంద్రబాబు నువ్వేమన్నా కొత్తగా పార్టీ పెడుతున్నావా..? నీ గురించి రాష్ట్ర ప్రజలకు తెలియదా..? 
- ఇచ్చిన వాగ్ధానాన్ని నీ జన్మ మొత్తంలో ఒకటన్నా అమలు చేశావా..? 
- రైతులకు రుణమాఫీ చేశాను అంటున్నాడు..ఎక్కడ చేశావయ్యా..?
- కోటయ్య కమిటి, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అన్నావ్‌..డ్వాక్రా మహిళకు రుణమాఫీ అన్నావ్‌..ఏదైనా చేశావా..? 
- అదేమని అడిగితే చేసేశాంగా అంటూ ఘీంకరిస్తాడు...
- నీ 14ఏళ్లు పరిపాలనలో మేనిఫెస్టోలో ఒకటన్నా అమలు చేశావా..? 
- నిరుద్యోగ భృతి 3 వేలు ఇస్తావా..? గతంలో ఏం చేశావ్‌...2వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇచ్చావా..? 
- మీరెవ్వరూ ఊహించని విధంగా పరిపాలన చేస్తా అంటే నీ బండారం ప్రజలకు తెలియదా..? 
- చివర్లో టోపీ పెట్టుకుని ప్రజల నెత్తిన వాగ్ధానాల టోపీ పెట్టాడు. 
-  జగన్‌ గారిని దించేయండి...నన్ను అధికారంలోకి తీసుకురండి అనడం తప్ప మహానాడు ఏముంది..? 
- నేను చేసిన ఐదేళ్ల పరిపాలనను మళ్లీ తీసుకొస్తా అనే ధైర్యం చేయలేకపోయావు. 

ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్నీ అమలు చేసిన నేత శ్రీ వైఎస్‌ జగన్‌:
- ఈ దేశంలో మేనిఫెస్టోని భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లా భావించి ప్రతి విషయాన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ గారు.
- దస్తాలకు దస్తాలు మేనిఫెస్టో ఇచ్చి ఒకటి కూడా అమలు చేయని చరిత్ర చంద్రబాబుది.
- నీ 14 ఏళ్ల పరిపాలన చరిత్రను, ఈ నాలుగేళ్ల జగన్‌ గారి పరిపాలనను బేరీజు వేసుకోండి. 

యస్‌...రానున్నది కురుక్షేత్ర యుద్ధమే:
- రానున్నది కురుక్షేత్ర యుద్ధమే...సందేహం లేదు..
- నువ్వొక్కడివే వస్తావా..? ఇంకా ఎవర్నైనా తెచ్చుకుంటావా..? 
- మేం ఒక్కళ్లమే వస్తాం...జగన్‌ గారి సంక్షేమ సైన్యం వస్తుంది...
- పేదలకి, పెత్తందార్లకి జరిగే ఈ కురుక్షేత్ర సంగ్రామంలో పేదలదే విజయం. 
- పేదవారిని ధనవంతుడిని చేసి..పేదవాళ్లు లేని రాష్ట్రాన్ని చేస్తాడట..
- 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశారుగా..అప్పుడెందుకు చేయలేదు..? 
- అధికారంలోకి రాననే భయంతో పేదవాళ్లని ధనవంతులను చేస్తాం అంటున్నాడు. 
- నువ్వు ఏ ఒక్క పేదవాడినైనా ధనవంతుడిని చేసిన చరిత్ర నీకు ఉందా..? 
- నువ్వు ధనవంతుల్ని చేసింది రామోజీరావు, టీవీ5 నాయుడు, రాధాకృష్ణ, సుజనా చౌదరి, లోకేశ్‌లను తప్ప ఏ పేదవాడిని ధనవంతుడిని చేశావు..? 
- ఖరీదైన రాజకీయాలు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి టీడీపీది
- రాజకీయాలను వ్యాపారం చేసింది చంద్రబాబు
- టీడీపీ నీతివంతమైన పార్టీ అంటాడు...నువ్వు తెలంగాణాలో డబ్బులు పంచలేదా..? 
- ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు నువ్వంతా డబ్బుపైనే నడిపావు కదా.
- అదే డబ్బుతో చంద్రబాబు సైకిల్‌ గుర్తును కూడా లాక్కున్నాడు. 
- ఈ 14 ఏళ్లు చేయని పరిపాలన ఊహించని విధంగా ఇప్పుడు చేస్తావా..? 
- దుర్మార్గం చేస్తే...అబద్దాలు చేప్తే పైనున్న ఎన్టీఆర్‌ కూడా సహించడని గుర్తుంచుకోండి. 
- ఏదో ఒక విధంగా పోయిన అధికారం తీసుకోవాలని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. 
- కొంత మంది కల్లు తాగిన కోతిలా మహానాడు వేదికపై వ్యవహరించారు. 
- జగన్‌ గారిపై అవాకులు చెవాకులు పేలి నీ మన్ననలు పొందాలనే ప్రయత్నం చేశారు..అది సాగదు. 
- మళ్లీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుంది..మేం చెప్పంది చేసి చూపించాం.
- నువ్వు చెప్పిందేదీ చేయలేదు..నువ్వెన్ని వాగ్ధానాలు చేసినా ప్రజలెవ్వరూ నమ్మరు. 

సెంటు భూమి ఇస్తుంటే అల్లాడిపోయిన నువ్వు పేదవాడిని ధనవంతుడిని చేస్తావా..?
- కులం పేరు తీస్తే చెప్పుతీసి కొట్టాలంటే మొదటిగా చంద్రబాబు, ఆయన కుమారుడినే కొట్టాలి.
- మా రక్తాన్ని కూడా వేరే కులానికి ఇవ్వము అనే పరిస్థితికి నీ పరిపాలన వెళ్లింది. 
- పేద వాడికి ఒక సెంటు భూమి ఇవ్వడానికి జగన్‌ గారు ప్రయత్నం చేస్తే ఎంత యుద్ధం చేశావో అందరూ చూశారు. 
- సుప్రీం కోర్టు కూడా మొట్టికాయలు వేసినా పత్రికల్లో ఇష్టం వచ్చినట్లు రాయించావ్‌
- పేదవాడికి సెంటు భూమి ఇస్తుంటేనే అల్లాడిపోయిన నువ్వు పేదవాడిని ధనవంతుడిని చేస్తావా..?
- ఈ సారి మీరు నాకు ఓట్లు వేయకపోతే ఇదే నాకు చివరి ఎన్నిక అని గతంలోనే బాబు చెప్పేశాడు. 
- అదే జరిగేది..నీ వల్ల కాదు..నువ్వు చేసేవన్నీ మోసాలు..నక్క జిత్తులు. 
- ఎన్ని హంగామాలు చేసినా, మోసం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 

భవిష్యత్తు గ్యారెంటీ లేని పార్టీ నీది:
- భవిష్యత్తు గ్యారెంటీ లేని పార్టీ నీది చంద్రబాబూ...
- ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జగన్‌ గారిని ఇష్టారీతిన మాట్లాడుతున్నావు. 
- నీ కుమారుడు వయసున్న జగన్‌గారిపై ఆక్రోశాన్ని చూపిస్తున్నావు అంటే జగన్‌ గారు అత్యంత బలశాలి, ఆయన్ను ఎదుర్కోలేకపోతున్నావని నీలో స్పష్టంగా కనిపిస్తోంది. 
- హామీలు అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉన్న వాడికి ఇబ్బంది కానీ...అధికారంలోకి రాను అనుకునే వాడు ఎన్నైనా వాగ్ధానాలు ఇస్తాడు. 
- చంద్రబాబుకు ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకున్న చరిత్ర ఉన్నదా..?
- క్యాష్‌వార్‌ చంద్రబాబుకే అలవాటు. హైదరాబాద్‌లో డబ్బుతో ఓటును కొంటూ దొరికిపోయి పారిపోయి వచ్చినవాడు చంద్రబాబు. 
- క్యాష్‌ తో రాజకీయాలు చేయాలనుకుంటాడు తప్ప తన శక్తితో రాజకీయాలు చేయాలనుకునే వ్యక్తి చంద్రబాబు కాదు. 

Back to Top