పోలవరం వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి అంబటి

ఏలూరు: పోలవరం వద్ద వరద ఉధృతిని మంత్రి అంబటి రాంబాబు అధికారులతో కలిసి పరిశీలించారు. పోలవరం వద్ద ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని, 30 లక్షల క్యూసెక్కులు వస్తే కాపర్‌ డ్యామ్‌ వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందన్నారు. అందుకే నష్ట నివారణ చర్యలు చేపట్టామని వివరించారు. ఇప్పటికే లోయర్‌ కాపర్‌ డ్యామ్‌ మునిగిపోవడంతో డయాఫ్రం వాల్‌పై నీరు చేరి పనులు నిలిచిపోయాయన్నారు. ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద ప్రవాహం రానుందని, పోలవరం వద్ద 28 లక్షల క్యూసెక్కులు వచ్చినా అప్పర్‌ డ్యామ్‌ తట్టుకోగలదన్నారు.  అంతకంటే ఎక్కువ వరద వస్తే ఇబ్బందిక‌ర‌ పరిస్థితి ఏర్పడుతుందని, ముందస్తు చర్యల్లో భాగంగా ఎత్తు పెంచే ఏర్పాట్లు చేపట్టామని వివరించారు. 
 

తాజా వీడియోలు

Back to Top