అవినీతిలో అభినవ వీరప్పన్ చంద్రబాబు

స్కిల్డ్ క్రిమినల్ చంద్రబాబు చట్టానికి దొరికాడు

స్కిల్‌ స్కామ్‌ తీగ మాత్రమే.. మున్ముందు బయటపడే డొంక చాలానే ఉంది

40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబుది అంతులేని అవినీతి

చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష కానేకాదు

వ్యవస్థల్లో స్లీపర్‌ సెల్స్‌తో బండి లాగిస్తున్న బాబు

ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ 

విశాఖ‌: ప్రజల్లో పెద్ద మనిషిగా చెలామణి అవుతూ.. అనేక అక్రమాలు చేసిన చరిత్ర చంద్రబాబుద‌ని, 40 ఏళ్లుగా సీనియర్ పొలిటిషియన్ అని చెప్పుకునే చంద్రబాబు ఇంత కాలానికి దొంగగా దొరికాడని ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ అన్నారు. చంద్రబాబు ఒక స్కిల్డ్ క్రిమినల్.. స్కాంల విషయంలో ఆయన పేరు బయటకు వచ్చినప్పుడల్లా.. సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకుని తప్పించుకుతిరుగుతున్న స్కిల్డ్‌ క్రిమినల్ అని చాలాసార్లు చెప్పామ‌న్నారు. ఏరోజు బోను ఎక్కలేదు.. నన్ను ఎవ్వరూ తప్పు పట్టలేదని గొప్పులు చెప్పే వ్యక్తి.. ఎన్నో నేరాలు, ఘోరాలు చేసి ఇంతకాలం తప్పించుకు తిరిగాడని. కానీ, ఈరోజు కటకటాల వెనక్కి వెళ్లాల్సిన సందర్భం వచ్చిందన్నారు. అవినీతిలో చంద్రబాబు అభినవ వీరప్పన్.. వీరప్పన్ అడవుల్లో ఉన్నాడు కాబట్టి దొంగ కాకుండా పోడు. ఈయన దొంగ పనులు, అనేక ఘోరాలు చేసి పెద్ద మనిషిగా చెలామణి అవుతూ.. రాజకీయ పార్టీని నడుపుతూ ఇవాళ కటకటాల పాలైయ్యాడన్నారు. విశాఖ‌లో మంత్రి అమ‌ర్‌నాథ్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఏం మాట్లాడారంటే..

ఇన్ని పాపాలు, తప్పులు, నేరాలు, ఘోరాలు, అవినీతి కార్యక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు. రూ.370 కోట్ల ప్రజాధనాన్ని కొట్టేయటానికి స్కీం తయారు చేసి స్కాం ద్వారా కొట్టేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఎలా స్కాం చేసి ప్రజాధనం కొట్టేశారో సీఎం వైయ‌స్ జగన్ సాక్ష్యాధారాలతో ప్రజల ముందు పెట్టారు కూడా. ఇంత పెద్ద కేసు నడుస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు నుంచి లాయర్లను తెచ్చి పెద్ద ఎత్తున ఫీజులు చెల్లించాడు. చంద్రబాబుతో పాటు మరో 15 మంది లాయర్లను పెట్టుకున్నారు. చివరికి చంద్రబాబే లాయర్ అవతారం ఎత్తారు. కేసు వాదించుకుంటానని చంద్రబాబు రాజకీయ ప్రసంగం చేశారని టీవీ ఛానల్స్‌లో ప్రసారం అయింది. ఎన్ని వాదనలు చేసినా, ఎంత పెద్దపెద్ద లాయర్లు తెచ్చినా చివరకు చంద్రబాబుకు రిమాండ్ తప్పలేదు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. 

అనేక సందర్భాల్లో టీడీపీ నాయకులు స్కిల్ స్కాంపై స్పందించారు కానీ.. కేసుకు చంద్రబాబుకు సంబంధం లేదని ఎక్కడా అనలేదు. స్పీకర్‌కు చెప్పి అరెస్టు చేశారా? గవర్నర్‌కు చెప్పారా? వారి పర్మిషన్‌ తీసుకున్నారా? నాపేరు ఎఫ్‌ఐఆర్‌లో పెట్టారా? లేదా? ఈ సెక్షన్లు నాకు వర్తించవని లా పాయింట్లు మాట్లాడుతున్నారు కానీ.. స్కాంకు.. చంద్రబాబుకు సంబంధం లేదనటం లేదు. స్కాంపై విచారణకు సిద్ధమని చంద్రబాబు ఎక్కడా చెప్పలేదు. చంద్రబాబును అలా అరెస్టు చేయకూడదని అంటారు కానీ..అవినీతితో ఆయనకు సంబంధం లేదనే మాటను ఎవ్వరూ అనరు. అచ్చెన్నాయుడు, టీడీపీ నాయకులు, కమ్యూనిస్టులు కానీ, పురంధేశ్వరి, పవన్ కల్యాణ్‌ కానీ స్కాంతో బాబుకు సంబంధం లేదని అనటం లేదు. 

ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాంకు సంబంధించి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే అని కోర్టు నమ్మింది. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.370 కోట్లు మాయమైపోవటానికి సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని 14 రోజులు రిమాండ్ విధించింది. వైఎస్‌ఆర్‌సీపీ కక్ష సాధింపు చర్యలుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు.. చంద్రబాబు చేసిన తప్పులు, పాపాలు, నేరాలు, అవినీతి అక్రమాలు సామాన్య ప్రజలకు తెలియాలి. అంతేకానీ, ఇది రాజకీయ కక్ష కానీ, కక్షసాధింపులో చేసిన కార్యక్రమం ఏమాత్రం కాదు. అనేక వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకున్న చంద్రబాబును చూశాం. చివరకి ఎన్టీఆర్‌ను పదవీత్యుచుడిని చేసిన సందర్భంలో ఏ రకమైన క్రిమినల్ కార్యక్రమాలు చేశారో.. మొన్న తెలంగాణలో ఓటుకు నోటు కార్యక్రమంలో దొరికినప్పుడు కూడా నేను తప్పు చేయలేదని చెప్పలేదు. నా ఫోన్లు ఎలా ట్యాపింగ్ చేస్తారు. నాకు సెక్షన్‌ (8) ఉంది. నాకు ఏసీబీ, పోలీసులు ఉన్నారని వితండ వాదం చేశారు తప్ప ఓటుకు నోటు కేసులో సంబంధం లేదని, తప్పు చేయలేదని కానీ చంద్రబాబు చెప్పలేదు. 

సీపీఐ రామకృష్ణ, నారాయణ, మరిదిని వెనకేసుకు వస్తూ పురంధేశ్వరి మాట్లాడతారు. దత్తపుత్రుడు అయితే.. ఓవైపు నడక, పడక వేషాలు వేశారు. కొడుక్కి లేని బాధ దత్తపుత్రుడులో కనపడింది. ఇలాంటి రాజకీయ పార్టీలు.. నాయకులు.. ఇటువంటి దొంగని వెనకేసుకు వచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అనేక వ్యవస్థల్లో స్లీపర్ సెల్స్‌గా తన మనుషుల్ని పెట్టుకుని వ్యాపారస్తులను, అధికారులను, ఇతర రాజకీయ పార్టీల నాయకుల్ని మేనేజ్ చేయగలను, ఇబ్బంది పెట్టగలను అనే విధంగా మూడున్నర దశాబ్ధాలుగా రాజకీయాలు చెలాయించారు. వాటన్నింటికీ ఇవాళ పులిస్టాప్ పడింది. 

ఏలేరు స్కాం, ఐఎంజీ భారత్, స్టాంపుల కుంభకోణాలన్నీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న తొలినాళ్లలో చేసినవి. ఇప్పుడు 2014-19 మధ్య అమరావతి పేరిట చేసిన స్కామ్‌లు, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం, ఫైబర్ నెట్‌ స్కాం, కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు కొట్టేసి.. లంచాల రూపంలో రూ.119 కోట్లు సబ్‌ కాంట్రాక్టర్ల ద్వారా తీసుకుని చంద్రబాబు దొరికిపోయారు. చంద్రబాబు హయాంలో విశాఖలో జరిగిన ల్యాండ్ స్కామ్‌లు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. చంద్రబాబు అవినీతి సామ్రాజ్యాన్ని కప్పిపుచ్చటానికి ఎల్లో మీడియా, దుష్టచతుష్టయం, ఆయన స్లీపర్ సెల్స్‌ ప్రయత్నిస్తున్నారు.

గత పదిరోజులుగా చంద్రబాబు, ఆయన కొడుకు ఏం పీక్కుంటారో.. పీక్కోండని మాట్లాడారు. పీకమని మాట్లాడిన వారంతా ఇవాళ తోక ముడిచి జోకర్లు అయిపోయారు. ఎంతకాలం దాక్కున్నా.. దొంగ దొరక్కమానడు. ఇవాళ అదే జరిగింది. చంద్రబాబు చేసిన తప్పులు, పాపాలు, అన్యాయాలకు ఇవాళ పులిస్టాప్ పడింది. ఇది ప్రజల విజయం. 40 ఏళ్లుగా చంద్రబాబు ప్రజలకు సూక్తులు, ప్రవచనాలు చెప్పాడు. కానీ, అవినీతికి ఫ్యాంట్, షర్ట్ వేస్తే అది చంద్రబాబే. చంద్రబాబు చేసిన స్కాంల్లో ఇది మొదటిది మాత్రమే. మిగతావన్నీ కూడా బయటకు వస్తాయి. చంద్రబాబు శేష జీవితం శ్రీకృష్ణ జన్మస్థానమే అని గమనించాలి. దీన్ని సమర్థించుకునే సందర్భం.. ఎల్లో మీడియా, టీడీపీ నాయకులకు, తోడు దొంగలకు లేదు.  చంద్రబాబు చేసిన అన్యాయాలు, అక్రమాలు ప్రజలు గమనించాలి. 

టీడీపీ పిలుపు ఇచ్చే బంద్‌ల్లో ఎవ్వరూ పాల్గొనరు. చంద్రబాబు ఏమీ మహాత్ముడు కాదు. దేశ స్వాతంత్ర్యం కోసం జైలుకు వెళ్లటం లేదు. చంద్రబాబు చేసిన అవినీతి కార్యక్రమాలకు జైల్లో పెట్టారని ప్రజలు గమనించాలి. ఎవ్వరూ బంద్‌కు సహకరించాల్సిన అవసరం లేదు. పవన్ కల్యాణ్‌ నుంచి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చంద్రబాబు కోసం పవన్ నడక నుంచి పడక వరకు అన్నీ చేసేశారు. చంద్రబాబు అంటే ఎంత ప్రేమో.. నిన్న పవన్ మాటలు, చేష్టలతో చూశాం. దత్తతండ్రి కోసం లోకేశ్‌ కంటే ఎక్కువగా పవన్ బాధపడుతున్నాడు. స్కాంలో కూరుకుపోయిన చంద్రబాబును సమర్థిస్తున్నాడంటే అవినీతిలో పవన్ వాటా కూడా ఉంది. షూటింగ్, పొలిటికల్ యాక్టింగ్ మధ్య రెండు, మూడు రోజుల గ్యాప్ తీసుకోవాలి. కేంద్ర నిఘా సంస్థలు చెప్పాయని ఏదో స్టోరీలు ప్రజలకు చెబితే.. ఎవరు నమ్ముతారు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. దత్తతండ్రి అరెస్టు అయి జైలుకు వెళ్తుంటే.. ఇలాంటి స్టోరీలు చెబుతాడు. ఎక్కడైనా వినటానికి, వాస్తవానికి దగ్గరగా ఏదైనా ఉందా? ఆయన సినిమాలు తీసుకుంటే మంచిది. దత్తతండ్రి జైలుకు కూడా పోయాడు. దేనికోసం తపన పడుతున్నాడో అర్థం కావట్లేదు. తీగ లాగితే డొంకంతా కదులుతుంది. ఇది తీగ మాత్రమే.తీగతో పాటు అనేక రకాల కేసులు ఉన్నాయి. అసైన్డ్ ల్యాండ్, అమరావతి, పోలవరం, పట్టిసీమ ఇలా అనేక ఇష్యూలు ఉన్నాయి. ఇది సాంపిల్ మాత్రమే. చంద్రబాబు చేసిన అన్యాయాలు, అక్రమాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. పాత్రలు ఉన్న ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించక తప్పదు.

Back to Top