శ్రీకాకుళంపై సీఎం వైయస్‌ జగన్‌​ ప్రత్యేక దృష్టి

శ్రీకాకుళంలో సమీక్ష చేపట్టిన మంత్రి ఆళ్ళ నాని

 
 శ్రీకాకుళం : మొన్నటి వరకు సురక్షిత ప్రాంతంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు కరోనా వైరస్‌ సోకడం దురదృష్టకమరని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఆళ్ళ నాని అన్నారు. శ్రీకాకుళంలో శనివారం కరోనా వైరస్‌ తొలి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంతో కలసి ఆళ్ల నాని ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. జిల్లాలో వైరస్‌ బయటపడిన వెంటనే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనను వెంటనే శ్రీకాకుళం వెళ్లాల్సిందిగా ఆదేశించారని తెలిపారు. కరోనాపై అందరూ జాగ్రత్త వహించాలని, జిల్లాపై సీఎం ప్రత్యేక దృష్టిపెట్టారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన కోవిడ్ మార్గదర్శకాలు అందరూ పాటించాలని ఆదేశించారు.  

తాజా వీడియోలు

Back to Top