నిరుపేదలకు ఖరీదైన వైద్యం అందించాలన్నదే సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఆకాంక్ష  

డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

విశాఖపట్నం: నిరుపేదలకు ఖరీదైన వైద్యం అందించాలన్నదే ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. గత టీడీపీ పాలనలో వైద్య వ్యవస్థ భ్రష్టు పట్టిందని ఆయ‌న విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 16 మెడికల్‌ కళాశాలలు, గిరిజన ప్రాంతాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రూ.50 కోట్ల అంచనా వ్యయంతో ఒక్కో ఆసుపత్రిలో 120 పడకలు ఏర్పాటు, పాడేరు తరహాలో సీతంపేట, పార్వతీపురం ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు స్థల పరిశీలన చేస్తున్నామని ఆయన వెల్లడించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top