కల్తీ మద్యం అయితే అందరికీ ఒకే లక్షణాలు ఉండాలి

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని
 

అమరావతి:  జంగారెడ్డి గూడెంలో రకరకాల కారణాలతో మరణాలు సంభవించాయని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధులు, లివర్‌ వ్యాధులు, గుండెజబ్బులతో చనిపోతే..అందరూ కల్తీ మద్యంతో మరణించారని టీడీపీ సభ్యులు ఆరోపించడం సరికాదన్నారు. కల్తీ మద్యం అయితే అందరికీ ఒకే లక్షణాలు ఉండాలి కదా అని ప్రశ్నించారు. ఒక్కొక్కరు ఒక్కో కారణంతో చనిపోయారని మంత్రి తెలిపారు. ఉద్దానం ప్రాంతంలో ప్రజల ఇబ్బందులు ఉన్నాయి, పలు సమస్యలపై సభలో చర్చించాల్సి ఉండగా ప్రతిపక్ష నేతలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పై బురద జల్లే రాజకీయాలకు తెర లేపారని మండిపడ్డారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top